రామ్ చరణ్, వివి వినాయక్ కొత్త సినిమా షురూ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, దర్శకుడు వివి వినాయక్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ప్రారంభోత్సవం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి దంపతులు హాజరయ్యారు. రామ్ చరణ్ మదర్ సురేఖ తొలి షాట్ కు క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు, ఎస్ ఎస్ రాజమౌళి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేస్తుంది. ఇంకా సెకండ్ హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధా క్రిష్ట సమర్పకులు. ఆకుల శివ ఈ చిత్రానికి కథా రచయితగా కాగా, కోన వెంకట్ మాటల రచయితగా పని చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సినిమా టైటిల్ ఖరారు కావాల్సి ఉంది.
రామ్ చరణ్ తేజ్ ఇమేజ్ కు తగిన విధంగా ఫుల్ మాస్ మూవీగా ఈ సినిమా తెరకెక్క బోతెందని తెలుస్తోంది. వివి వినాయక్ మెగా ఫ్యామిలీతో ఇది వరుసగా రెండో సినిమా కావడం గమనార్హం. వినాయక్ ఇది వరకే అల్లు అర్జున్ తో బద్రీనాథ్ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఇక పోతే..... రామ్ చరణ్ నటిస్తున్న రచ్చ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











