రామ్ చరణ్, వివి వినాయక్ ఫిల్మ్ రేంజే వేరు..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. కమర్షియల్ సినిమాలు రూపొందించడంలో మంచి ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచిన వినాయక్ ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా రూపొందిస్తున్నారు. రామ్ చరణ్ ఈచిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆరెండు పాత్రల సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్‌గా సెలక్ట్ అయ్యారు.
నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....రామ్ చరణ్ కెరీర్లో వచ్చిన సినిమాలన్నింటినీ మించిన రేంజిలో ఈచిత్రం రూపొందుతోందని, ఈ చిత్రం తప్పకుండా అభిమానులకు పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తుందని తెలిపారు. చెర్రీని వినాయక్ ఫుల్ ఎనర్జిటిక్‌గా చూపింబోతున్నారని, క్లాస్ ఆడిన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను మెప్పించే అంశాలు సినిమాలో ఉంటాయని చెప్పారు.
ఈ చిత్రానికి ఆకుల శివ కథ అందించారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నారు. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, సత్యం రాజేష్, సుధా రాహుల్ దేవ్, రఘుబాబు, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత, అమీ జాక్సన్ నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. మరో వారం రోజుల్లో చెర్రీ సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చి తన పెళ్లి సంబరంలో మునిగిపోనున్నాడు.


Click it and Unblock the Notifications











