ఆ విషయంలో చిరంజీవి ఓకే అంటే కానీ చరణ్ చెయ్యలేడు...
'మగధీర"తో టాప్ హీరో రేంజ్ కి వెళ్లిపోయిన రామ్ చరణ్ 'ఆరెంజ్"తో అంతే వేగంగా పడిపోయాడు. అప్పట్నుంచి ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ తో సినిమా తియ్యాలనుకునేవాళ్ళే. సంపత్ నంది, వినాయక్, క్రిష్..ఇలా అందరు డైరెక్టర్లతో సినిమాలు వున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వాటిలో రామ్ చరణ్ ఇమ్మిడియట్ గా సంపత్ నంది సినిమా చేయబోతున్నట్టు కన్ ఫర్మ్ అయింది. దాని తర్వాత వినాయక్ సినిమా ఉంటుంది.
ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే 'అనగనగా ఓ ధీరుడు" దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి చరణ్ తో ఓ సినిమా చెయ్యబోతున్నట్టు తెలిసింది. రాఘవేంద్రరావుకి జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తియ్యాలని ఎప్పటి నుంచో వుంది. ఇప్పుడు చిరంజీవితో కుదిరే పని కాదు. ఆ పనేదో రామ్ చరణ్ తో తన కుమారుడు ప్రకాష్ డైరెక్షన్ లో చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యాడు. ఈ విషయం చిరంజీవితో కూడా డిస్కస్ చేశారట. స్ర్కిప్ట్ అంతా చదివాక తన నిర్ణయం చెబుతానని చిరంజీవి అన్నాడని తెలిసింది. అయితే చరణ్ మాత్రం ఈ సినిమా చెయ్యడానికి ఉవ్విళ్లూరుతున్నాడట. మరి చిరంజీవి ఫైనల్ గా ఏం చెబుతాడో..!


Click it and Unblock the Notifications











