twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంచరణ్, బోయపాటి సినిమా.. ఆ పుకార్లు నిజమేనా!

    |

    Recommended Video

    Ram Charan DisAgrees For Few Scenes With Boyapati Srinu

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న తొలి చిత్రం కనుక ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. బోయపాటి శ్రీను మాస్ చిత్రాలకు పెట్టింది పేరు. బోయపాటి సినిమాలని మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ చిత్రం కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లబోతోంది. ఇదిలా అండగా సోషల్ మీడియాలో రాంచరణ్, బోయపాటి చిత్రం గురించి కొన్ని పుకార్లు ప్రచారం జరుగుతున్నాయి.

    భారీ అంచనాలు

    భారీ అంచనాలు

    రంగస్థలం చిత్రం ఘనమైన విజయం సాధించి టాలీవుడ్ రికార్డులని తిరగరాసింది. రంగస్థలం చిత్ర తరువాత రాంచరణ్ నటించే సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని అంచనాలకు అనుగుణంగా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

    త్వరలోనే బ్యాంకాక్ షెడ్యూల్

    త్వరలోనే బ్యాంకాక్ షెడ్యూల్

    రాంచరణ్, బోయపాటి చిత్ర యూనిట్ త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెల్ళబోతోంది. అక్కడ రెండు వారాల పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. రాంచరణ్ లేకుండానే దర్శకుడు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసాడు. రాంచరణ్ మూడవ షెడ్యూల్ లో షూట్ లో జాయిన్ అయ్యాడు.

    సోషల్ మీడియాలో పుకార్లు

    సోషల్ మీడియాలో పుకార్లు

    రాంచరణ్, బోయపాటి చిత్రం గురించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. కొన్ని సన్నివేశాల పట్ల అసంతృప్తిగా ఉన్న చరణ్ వారిని రీషూట్ చేయాలని బోయపాటిని ఆదేశించినట్లు తెలుస్తోంది. రంగస్థలం చిత్రం విషయంలో కూడా ఇలాంటి పుకార్లే వచ్చాయి. ఏ వార్తల్లో వస్తున్న నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

    త్వరగా ఫినిష్ చేయాలని

    త్వరగా ఫినిష్ చేయాలని

    బోయపాటి చిత్రాన్ని త్వరగా ఫినిష్ చేయాలనీ రాంచరణ్ భావిస్తున్నాడు. దసరాకు విడుదలయ్యేలా ప్లానింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తరువాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందే మల్టీస్టారర్ చిత్రంలో చరణ్ నటించాల్సి ఉంది. ఎన్టీఆర్, రాంచరణ్ ఒకే ప్రేములో కనిపించబోతుండడంతో అభిమానుల్లో రాజమౌళి చిత్రం గురించి ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి.

    English summary
    Ram Charan wants to reshoot some scenes of Boyapati film. After Rangasthalam huge expectations on RC12
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X