‘సైరా’ బిజినెస్ టాక్: చరణ్ చెప్పే రేటు షాకే... కానీ న్యాయమే అంటున్న విశ్లేషకులు!

Recommended Video

Ram Charan Selling Sye Raa Theatrical Rights For This Huge Price? || Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతగా 'కొణిదెల ప్రొడక్షన్స్' బేనర్ స్థాపించిన తర్వాత తన తండ్రితో వరుస సినిమాలు చేయడం మొదలు పెట్టారు. తొలి చిత్రం 'ఖైదీ నెం 150'తో మొదటి ప్రయత్నంలోనే భారీ విజయంతో పాటు మంచి ప్రాఫిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

తన బేనర్లో చరణ్ నిర్మిస్తున్న రెండో చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆదారంగా రూపొందుతున్న ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ చిత్రం. ఈ మూవీ కోసం దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు అంచనా.

బెంబేలెత్తిపోతున్న డిస్ట్రిబ్యూటర్లు

బెంబేలెత్తిపోతున్న డిస్ట్రిబ్యూటర్లు

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్టును అక్టోబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు థియేట్రికల్ రైట్స్ సేల్ చేసే ప్రక్రియ మొదలైంది. అయితే ఈ సినిమాకు రామ్ చరణ్ చెబుతున్న రేట్లు చూసి డిస్ట్రిబ్యూటర్లు బెంబేలెత్తిపోతున్నారట.

ప్యాన్ ఇండియా మూవీగా ‘సైరా’

ప్యాన్ ఇండియా మూవీగా ‘సైరా’

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, హిందీ, తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. అమితాబ్, విజయ్ సేతుపతి లాంటి వారిని ఇందులో ప్రధాన పాత్రలకు ఎంపిక చేయడానికి కారణం దీన్ని కేవలం రీజనల్ మూవీలా కాకుండా ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడమే.

రామ్ చరణ్ చెబుతున్న రేటు ఎంత?

రామ్ చరణ్ చెబుతున్న రేటు ఎంత?

హిస్టారికల్ మూవీ, పైగా భారీగా బడ్జెట్ ఖర్చు పెట్టారు. మరి పెట్టిన పెట్టుబడి రికవరీ కావాలంటే సినిమాను సాధారణ రేట్ల కంటే కాస్త ఎక్కువగా అమ్మాల్సిన పరస్థితి. కేవలం తెలుగు వెర్షన్ నుంచే ఈ సినిమాకు రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారట రామ్ చరణ్. ఇతర భాషలన్నింటిలో కలిపి మరో రూ. 80 కోట్లు ఆశిస్తున్నారట. దీని ద్వారా సినిమా పెట్టబడి రికవరీ అవుతుందని అంచనా.

న్యాయమైన రేటే అంటున్న విశ్లేషకులు

న్యాయమైన రేటే అంటున్న విశ్లేషకులు

రామ్ చరణ్ చెబుతున్న రేటు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ... సినిమా బడ్జెట్ దృష్ట్యా అది న్యాయమైన రేటే అనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు అంత సత్తా ఉందని, అప్పుడెప్పుడో విడుదలైన ‘ఖదీ నెం.150' రూ. 102 కోట్ల షేర్ సాధించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

‘సైరా నరిసింహారెడ్డి' చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో ఈ చిత్రాన్నివిడుదల కాబోతోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X