దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఈవెంట్‌గా రామ్ చరణ్ మ్యారేజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన ప్రేయసి ఉపాసన కామినేనిని జూన్ 14న వివాహమాడబోతున్న సంగతి తెలిసిందే. ఇటు చరణ్ కుటుంబంతో పాటు, అటు ఉపాసన కుటుంబం కూడా బాగా ధన వంతులు. పైగా రాజకీయంగా, సీనీ రంగంలో భాగా పలుకు బడి ఉన్న వారు. ఈ నేపథ్యంలో తమ ముద్దుల వారసులు రామ్ చరణ్, ఉపాసన వివాహం దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈ వెంట్‌గా నిర్వహించేందుకు ఇరు కుటుంబాల వాళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక కోసం కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు పెట్టేస్తూ కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
వీరి వివాహానికి బాలీవుడ్ నుంచి మల్లూవుడ్ వరకు సినీ రంగానికి చెందిన ప్రముఖలతో పాటు, ఢిల్లీ స్థాయిలోని బడా రాజకీయ నాయకులు, కేంద్రమంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దేశ ప్రధాని మన్మోహన్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఖరారు కాలేదు.
ఇందు కోసం హైదరాబాద్ నగర శివార్లలోని హిమాయత్ సాగర్ సమీపంలోని ఉపాసన కుటుంబీకుల ఫాంహౌస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. వివిఐపిలు పెద్ద ఎత్తున హాజరవుతుండటంతో భద్రత ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. అదే విధంగా నగరంలోని లగ్జరీ హోటల్స్ అన్నీ చెర్రీ ఉపాసన వేడుకకు హాజరయ్య అతిథుల కోసం ముందస్తుగానే బుక్ అయిపోయాయి.
అయితే ఈవేడుకలోకి సాధారణ జనాలకు, అభిమానులకు అసలు ప్రవేశమే లేదు. వారి కోసం ప్రత్యేకంగా వివాహం మరుసటి రోజు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











