రామ్ చరణ్ పెళ్ళి, రిసెప్షన్ వెన్యూ ఎక్కడంటే
రామ్ చరణ్ వివాహం హైదరాబాద్ లోనూ, రిసెప్షన్ తిరుపతిలోనూ జరగనున్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు. ప్రస్తుతం రచ్చ షూటింగ్ కోసం తిరుపతిలోని రాయల చెరవుకు వచ్చిన రామ్ చరణ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. అలాగే వివాహంకు లిమిటెడ్ గెస్ట్ లను పిలుస్తానని,రిసెప్షన్ కి మాత్రం మెగా ప్యాన్స్ అందరికీ ఓపెన్ ఆఫర్ అని ఆయన అన్నారు. ఇక రచ్చ విషయానికి వస్తే..సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రం చేస్తున్న రామ్ చరణ్ చైనాలో షూటింగ్ పూర్తి చేసుకువచ్చారు. మెగా సూపర్‌గుడ్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఏమైంది ఈ వేళ చిత్రంతో దర్శకుడుగా మారిన సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు.మొదటి షెడ్యూల్ ని శ్రీలంకలో హీరో,హీరోయిన్స్ పై పాటను షూట్ చేసారు. వందశాతం మాస్ చిత్రమిదని,కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











