»   » అద్భుత క్షణాలవి.. గ్రేట్.. మెగా ఫ్యామిలీ ఎక్కడికి వెళ్లిందో తెలుసా!

అద్భుత క్షణాలవి.. గ్రేట్.. మెగా ఫ్యామిలీ ఎక్కడికి వెళ్లిందో తెలుసా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిత్యం బిజీగా ఉండే జీవితాల్లో ఒకరినొకరు కలుసుకోవడం చాలా కష్టమైన పని. ఎదైనా శుభకార్యం జరిగితే పనులన్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులను కలుసుకోవడానికైనా ఆసక్తి చూపుతారు. ఇటీవల జరిగిన పెండ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, కామినేని కుటుంబాల సభ్యులు, వారి సన్నిహితులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు.

'ఈ పెండ్లి వేడుకలో అద్భుతమైన క్షణాలను ఆస్వాదించాం. ఇలా కలుసుకోవడం వల్ల సంబంధాలు మరింత బలపడుతాయి. జీవితంలో వాటి విలువ తెలుస్తుంది. ఇంత గొప్ప కుటుంబం, స్నేహితులు ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫొటోలను త్వరలో మీతో పంచుకుంటాను' అని ఉపాసన ట్వీట్ చేసింది.

Ram charan wife Upasan shares happy moments with mega family in twitter

ఈ వేడుకలో దిగిన సెల్ఫీకి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ వారి కుటుంబ సభ్యులు చాలా హుషారుగా ఫొజుచ్చారు. రాంచరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ఉపాసన ట్యాగ్ చేశారు. ఈ వేడుకలో ఉపాసన తన కుటుంబం, స్నేహితులతో సరదాగా గడిపినట్టు స్పష్టమైంది.

Ram charan wife Upasan shares happy moments with mega family in twitter

మరో ట్వీట్‌లో తన తాత, అపోలో అధినేత ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాంచరణ్, ఆమె కలిసి దిగిన ఫొటోను పెట్టింది.
హ్యాపీ బర్త్ డే తాత. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మీరు స్ఫూర్తి. మీ విజన్ వెలకట్టలేనిది అని ఉపాసన ట్వీట్ చేసింది.

Ram charan wife Upasan shares happy moments with mega family in twitter

సెలబ్రిటీ హోదా ఉన్న ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. తాను ఆనందించిన మధుర క్షణాలను ఎప్పటికప్పుడు నెటిజన్లు, మెగా అభిమానులతో పంచుకొంటారు. ఇటీవల మహేశ్ బాబు సతీమణి నమ్రత బర్త్ డే సందర్భంగా దిగిన ఫొటోలను ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
Upasana is more active in social media. Recently Mega family including Chiranjeevi met in Wedding. Upasan shared Wedding photos in twitter
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu