పిల్లలను కనడం అనేది 20 ఏళ్ల ప్రాజెక్ట్: ఉపాసన
పిల్లల విషయంలో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. కిడ్స్ ....20 ఏళ్ల ప్రాజెక్టుగా ఆమె అభివర్ణించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగిన దాదాపు ఐదేళ్లు అవుతోంది. వీరి నుండి గుడ్ న్యూస్ ఎప్పుడు వింటామా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నాయే కానీ... చెర్రీ, ఉపాసన నుండి కిడ్స్ గుడ్ న్యూస్ రావడం లేదు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పిల్లల గురించి ఎదురైన ప్రశ్నకు ఉపాసన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మా వరకు పిల్లలను కనడం అనేది 20 సంవత్సరాల ప్రాజెక్ట్.... అంటూ వ్యాఖ్యానించారు.

గర్వపడేలా ఉండాలి
మా వరకు పిల్లలను కనడం అనేది 20 సంవత్సరాల ప్రాజెక్ట్. ఆ పరిస్థితుల గురించి మేము పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మా పిల్లలు 20 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి, వారు చాలా రైట్ మ్యానర్లో పెరిగారని గర్వపడేలా ఉండాలి... అని ఉపాసన వ్యాఖ్యానించారు.
Recommended Video


సరైన సమయంలో
సరైన సమయంలో పిల్లలను కడడంపై నిర్ణయం తీసుకుంటాం. అది పూర్తిగా మా పర్సనల్ విషయం అని ఉపాసన చెప్పుకొచ్చారు.

చెర్రికి పెద్ద అభిమానిని
రామ్ చరణ్‌కు తాను పెద్ద అభిమానిని అని ఉపాసన చెప్పుకొచ్చారు. తన భర్త జీవితంలోని ప్రతి విషయానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని తెలిపారు.

సంకోచించే రకం కాదు
ఎవరైనా మంచి పనులు చేసినా, తనకు నచ్చే పనులు చేసే వారిని ప్రశంసిచడానికి మిస్టర్ సి ఏ మాత్రం సంకోచించరు. ఇంట్లో పని చేసే వారిని కూడా ఆయన పొగిడేస్తుంటారని ఉపాసన తెలిపారు.

నా విషయంలో చాలా కేర్
నా విషయంలో చరణ్ చాలా కేర్ తీసుకుంటారు. కొన్ని సార్లు నేను ఆఫీసు నుండి రిటర్న్ అయ్యే సమయంలో నేను జాగ్రత్తగా ఇంటికి చేరేందుకు ఎవరినైనా పంపిస్తారు.... అని ఉపాసన చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











