రామ్ చరణ్ వైఫ్ ఉపాసన బతుకమ్మ సెలబ్రేషన్స్!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. బతుకమ్మ సెలబ్రేషన్స్ కి సంబంధించి ఆమె తన ఫేబ్ బుక్ పేజీలో కొన్ని ఫోటోస్ పోస్టు చేయడంతో పాటు ఈ ఉత్సవాలకు సంబంధించి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీ బతుకమ్మ సంబరాలు చాలా గ్రాండ్ గా జరుపుకుంటాం. మా గ్రాండ్ మదర్ నిర్వహిస్తున్న 'బాలిక నిలయం' అనే అనాధ శరణాలయానికి చెందిన గర్ల్స్ బతుకమ్మలు తయారు చేయడంలో మాకు హెల్ప్ చేసారని ఆమె తెలిపారు

ఇలాంటి సందర్భాలు మాతో పాటు ఆ అమ్మాయిలకు లైఫ్ లాంగ్ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నేను ఈ అమ్మాయిలతో పాటు పెరిగాను. వారి మొహాల్లో సంతోషం, ఆనందం చూడటం అంటే నాకు చాలా ఇష్టమని ఆమె పేర్కొన్నారు.

బతుకమ్మ ఉత్సవాల గురించి ఉపాసన వ్యాఖ్యానిస్తూ.... ఇది తెలంగాణ మహిళలు జరుపుకునే పూల ఉత్సవం. దుర్గా నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు ఈ బతుకమ్మ పూల ఉత్సవం జరుగుతుంది. బాలిక నిలయం గర్ల్స్, ఫ్యామిలీతో గడపటం చాలా సంతోషంగా ఉంది అంటూ ఉపాసన తెలిపారు. ఉపాసన ఫ్యామిలీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications