ఫ్లూ బారిన పడ్డ రామ్ చరణ్ భార్య... మెగా అభిమానుల పరామర్శల వెల్లువ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు రామ్ చరణ్ సంగతులు, అతడి సినిమాలకు సంబంధించిన పోస్టులు పెడుతూనే తన వృత్తి, అభిరుచుల గురించి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేస్తూ ఉంటారు ఈ కొణిదెల కోడలు పిల్ల.
అయితే ఆదివారం ఉపాసన ట్విట్టర్ పోస్ట్ అందరినీ షాక్‌కు గురి చేసింది. తనకు ఫ్లూ సోకినట్లు వెల్లడించిన ఆమె... 'సాడ్ సండే' అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉపాసనకు మెగా అభిమానుల పరామర్శల వెల్లువ మొదలైంది.
కనీసం ఈ రోజైనా రెస్ట్ తీసుకోండి
ఇలా జరుగడం కూడా ఒకవిధంగా మంచిదే. అలుపు లేకుండా పనిలో మునిగిపోయే మీరు ఈ విధంగా అయినా ఒకరోజు రెస్ట్ తీసుకుంటారు.. అంటూ కొందరు అభిమానులు ట్వీట్ చేయడం గమనార్హం.

మా అన్నయ్యను ఎవరు చూసుకుంటారు
ఉపాసన త్వరగా కోలుకోవాలంటూ పలువురు మెగా అభిమానులు సందేశాలు పోస్ట్ చేశారు. మీకు ఇలా అయితే మా అన్నయ్యను ఎవరు చూసుకుంటారు వదినగారు, మీరు త్వరగా రికవరీ కావాలి అంటూ ఆమెను పరామర్శలతో ముంచెత్తారు.

అలాంటి పరిస్థితిలోనూ...
ఉపాసన అలాంటి పరిస్థితిలోనూ... పెద్దపులుల సంరక్షణ కోసం అపోలో ఫౌండేషన్ చేపడుతున్న చర్యల గురించి ట్విట్టర్ ద్వారా వివరిస్తూ పోస్టులు చేయడం గమనార్హం. జబ్బుపడినా రెస్ట్ తీసుకోకుండా ఆమె తన పనిలో ముగిపోయి కష్టపడుతున్న తీరు చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

రామ్ చరణ్
‘వినయ విధేయ రామ' రిలీజ్ ముందు వరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టులు షేర్ చేసి ఉపాసన ఆ మూవీ పరాజయం తర్వాత... రామ్ చరణ్ గురించి పోస్టులు చేయడం ఆపేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











