ఆ హీరోయిన్ ద్వారా ఇన్‌స్పైరైన చరణ్ వైఫ్ ఉపాసన

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కేవలం రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాదు....ఇతర కార్యక్రమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. అపోలో గ్రూపు సంస్థల డైరెక్టర్‌గా కార్యకలాపాల్లో మునిగి తేలేతూనే...పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. దీంతో పాటు జంతువులు, స్ట్రీట్ డాగ్స్ సంరక్షణ కోసం కూడా తన వంతు సహాయం చేస్తోంది.

ఇటీవల ఆమో మీడియాతో మాట్లాడుతూ జంతు సంరక్షణపై తనకు ఎలా ఆసక్తి కలిగిందనే విషయాలు చెప్పుకొచ్చారు. మాజీ హీరోయిన్, నాగార్జున భార్య అయిన అక్కినేని అమలను చూసి తాను ఇన్‌స్పైర్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో ఇలాంటి వాటిలో నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు, అక్కినేని అమల వల్లే తనలో మార్పు వచ్చిందని ఉపాసన చెప్పుకొచ్చారు. బ్లూ క్రాస్ సంస్థతో కలిసి తాను పని చేస్తున్నానని ఆమె తెలిపారు.

వీటితో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఉపాసన పాలు పంచుకుంటోంది. సేఫ్ డ్రైవింగ్ అంశంపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది. జీవితం ఎంతో విలువైనది...నిర్లక్ష పూరిత డ్రైవింగ్‌తో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందరూ బాధ్యతగా సేఫ్ డ్రైవింగ్ చేయాలని అంటోంది.

స్లైడ్ షో ఉపాసన వివిధ సందర్భాల్లో మాట్లాడిన వివరాలు..

ఉపాసన, అమల

ఉపాసన, అమల


రామ్ చరణ్ వైఫ్ ఉపాసన, నాగార్జున వైఫ్ అమల బెస్ట్ ఫ్రెండ్స్.

రామ్ చరణ్, ఉపాసన

రామ్ చరణ్, ఉపాసన


రామ్ చరణ్, ఉపాసన ప్రేమ లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా, సాఫీగా సాగుతోంది. రామ్ చరణ్ తన సినిమా ప్రొఫెషన్లో బిజీగా గడుపుతుంటే, ఉపాసన కూడా తను ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చరణ్ గురించి

చరణ్ గురించి


చరణ్ బెస్ట్ ఫ్రెండ్ చరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, అతన్ని పెళ్లి చేసుకోవడం తన జీవితంలో ఎంతో సంతోషకర విషయమని ఉపాసన గతంలో ఓ మేగజైన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తాతయ్య ప్రభావం

తాతయ్య ప్రభావం


ఉపాసన తాతయ్య, అపోలో గ్రూఫ్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి. ఆయన ప్రభావం తనపై ఎంతో ఉందని, ఆయన పాటిజివ్ థికింగ్, ఆయన ఆలోచన విధానం తనలో ఎంతో మార్పును తెచ్చిందని ఉపాసన రిట్జ్ మేగజైన్ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X