కొన్ని సార్లు భర్త కూడా తప్పు చేస్తాడు: రామ్ చరణ్ భార్య ఉపాసన
పరిస్థితులు ఎన్ని మారినా మహిళలను చాలా రంగాల్లో తొక్కేస్తున్నారనే భావన ఇప్పటికీ చాలా మంది మహిళల్లో ఉండిపోయింది. అఫ్ కోర్స్ అందులో కొంత వరకు నిజం కూడా లేక పోలేదు. అదే సమయంలో కొందరు మహిళలు తమకు లభించిన స్వేచ్ఛను విచ్చలవిడిగా వాడేస్తూ మహిళా లోకానికే మచ్చతెస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఈ రెండు అంశాల మధ్య ప్రతి సంవత్సరం ఉమెన్స్ డే సందర్భంగా రకరకాల చర్చలు, వాదనలు జరుగుతూనే ఉన్నాయి.
మహిళా ఎంట్రెప్రెన్యూర్‌గా వ్యాపారంలో తన సత్తా చాటుతూనే... భార్యగా తన బాధ్యతలు మరువకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతి సక్సెస్‌ఫుల్ మ్యాన్ వెనక ఒక ఉమెన్
ప్రతి సక్సెస్‌ఫుల్ మ్యాన్ వెనక ఉమెన్ ఉంటుంది. అందుకు సరైన ఉదాహరణ మా అమ్మమ్మ. ఆమె ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఆమె వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. భర్తను విజయవంతంగా ముందుకు నడిపించడం భార్య బాధ్యత అని ఉపాసన చెప్పుకొచ్చారు.

కొన్ని సార్లు భర్త తప్పులు చేస్తారు
కొన్ని సార్లు భర్త తప్పులు చేస్తారు. ఆ సమయంలో మనం బౌండరీలోనే ఉండిపోకుండా రూల్స్ బ్రేక్ చేసి బయటకు వచ్చి వాటిని సరిద్దాల్సిన అవసరం ఉంది... అని ఉపాసన వ్యాఖ్యానించారు.

మనది అద్భుతమైన కల్చర్
మన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది. మన సమాజంలో మహిళకు ఎంతో గౌరవం ఉంది. మనం ఎలా ఉండాలో మన సంస్కృతి మనకు నేర్పుతుంది... అని ఉపాసన తెలిపారు.

అంతా బావుంది, మార్పు అవసరం లేదు
మహిళల విషయంలో సమాజంలో ఇప్పుడున్న విషయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు ఉపాసన స్పందిస్తూ... అలాంటి అవసరం ఏమీ లేదని నా భావన. అంతా బానే ఉంది, మహిళలు తమకు కావాల్సింది సాధించుకునే సానుకూల పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని ఉపాసన చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











