Upasana Konidela: మెగా అభిమానులకు పండగలాంటి వార్త చెప్పిన ఉపాసన.. రెండో బిడ్డ గురించి..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురంచి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమెకు ఓ స్టార్ హీరోయిన్ రేంజులో పాపులారిటీ ఉంది. ఇక ఒక వ్యాపారవేత్తగా, మెగా ఇంటి కోడలిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ వస్తుంది. అయితే మెగా అభిమానులందరికీ పండుగ లాంటి శుభవార్త చెప్పింది ఉపాసన. ఈ విషయం విన్న మెగా ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. తన రెండో సంతానం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అసలు ఉపాసన ఏం చెప్పిందో కులంకషంగా ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి.
ఉపాసన కామినేని.. ఓ వైపు అపోలో హాస్పిటల్ చైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి మనవరాలిగా, ఆయన వార సత్వాన్ని నిలబెడుతూ వైద్య రంగంలో తన దైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరోవైపు పలు సామాజిక కార్యక్రమాలు, మెగా ఇంటి కోడలుగా బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. ఇవే కాకుండా 'బి పాజిటివ్' అనే హెల్త్ మ్యాగజైన్ కు ఉపాసన ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇలా సేవా రంగంలో తనదైన శైలిలో దూసుకెళుతోన్న ఉపాసన ఈసారి మెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది.

రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్న 11 ఏళ్ల తర్వాత గత ఏడాది క్లీంకారకు జన్మనిచ్చారు. వీరు పెళ్లి త్వరగానే చేసుకున్నప్పటికీ.. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకున్నారు. పిల్లల కోసం ఎన్ని ప్రశ్నలు ఎదురైనా.. వీరు తొందరపడలేదు. కరెక్ట్ సమయం వచ్చిందనుకున్నప్పుడే వారు పిల్లలను ప్లాన్ చేసుకున్నారు. అలా గతేడాది ఆడబిడ్డకు జన్మనిన ఈ జంట.. ఆ పాపకు క్లీంకార అని నామాకరణం చేసుకుని పండుగ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మెగా అభిమానులకు ఉపాసన పండుగ లాంటి న్యూస్ చెప్పింది. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన త్వరలోనే రెండో బిడ్డను ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించింది. మనల్ని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారని తెలిపింది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి తాను హాజరయ్యానని స్పష్టం చేసింది.

జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల నిర్ణయమన్న ఉపాసన... తాను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నానని అసలు విషయం బయటపెట్టింది. తన పక్కనున్న మేడమ్ కూడా లేట్ గానే పిల్లలు కావాలనుకున్నారని తెలిపింది.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేనేమీ బాధపడలేదని పేర్కొంది. అది తన ఇష్టం... అంతేకాదు తాను సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా రెడీగా ఉన్నానని గుడ్ న్యూస్ చెప్పింది.
ఇక ప్రస్తుతం ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఏడాది పూర్తయ్యేలోపు ఉపాసన మరో శుభవార్త చెప్పబోతుందంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈసారి రామ్ 2 రాబోతున్నాడు.. వారసుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉపాసన కూడా దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











