Upasana Konidela ప్రేమలో పడటం ఈజీనే కానీ.. రాంచరణ్‌తో బంధంపై ఉపాసన కామెంట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన ఎలాంటి విషయం చెప్పినా కూడా జనాలకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెబుతూ ఉంటారు. ఆమె చెప్పే ఉదాహరణలు అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఉపాసన చాలా ఓపెన్ గా అన్ని రకాల విషయాలను చెబుతూ ఉంటారు. ఇక రీసెంట్ గా ఆమె ప్రస్తుత దాంపత్య జీవితంలో సంతోషంగా ఎలా ఉండాలి అనే విషయం లో కొన్ని ఉదాహరణలు చెప్పారు. అలాగే రామ్ చరణ్ తో కొనసాగుతున్న లైఫ్ గురించి కూడా చెప్పారు.. ఆ వివరాల్లోకి వెళితే..

నిత్యం బిజీగా..

నిత్యం బిజీగా..


అపోలో హాస్పిటల్స్ అధినేత వారసురాలిగా ఉపవాసం ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు మెగా కోడలిగా మంచి గుర్తింపు అందుకుంటూ మరొకవైపు అపోలో హాస్పిటల్ కు సంబంధించిన వ్యవహారాలను కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. నిత్యం ఉపాసన ఎదో వర్క్ తో చాలా బిజీగా కనిపిస్తుంటే ఉంటారు. ఇక ఆమె ఎంత బిజీగా ఉన్న రామ్ చరణ్ తో రెగ్యులర్ గా టైమ్ స్పెండ్ చేస్తుంటారు.

సందేహాలు లేకుండా

సందేహాలు లేకుండా

ఉపాసన సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఆరోగ్య సూత్రాలను కూడా జనాలకు తెలియజేస్తూ ఉంటారు. ఉపాసన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెబుతూ ఉంటారు. చాలాసార్లు ఉపాసన చెప్పినా కొన్ని అంశాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏ విషయం చెప్పినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలని ఉపాసన సందేహాలు లేకుండా చాలా బలంగా చెబుతూ ఉంటారు.

ప్రేమలో పడినంత ఈజీ కాదు..

ప్రేమలో పడినంత ఈజీ కాదు..

అయితే రీసెంట్ గా ఆమె ప్రేమకు సంబంధించిన కొన్ని అంశాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ప్రేమలో పడినంత ఈజీ కాదు దానిని నిలబెట్టుకోవడం అనే పాయింట్ తో ఉపాసన ఆలోచించే విధంగా పలు ఉదాహరణలను సూచించారు. ఈ రోజుల్లో మీ భాగస్వామితో సంతోషంగా జీవితాన్ని గడపాలి అంటే తప్పకుండా ఇవి పాటించండి అంటూ ఆమె వివరంగా తెలియజేశారు.

రామ్ చరణ్ తో..

రామ్ చరణ్ తో..


నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన రామ్ చరణ్ తో వివాహమై 10 సంవత్సరాలు అయింది అని కూడా వివరణ ఇచ్చింది. ఇక వారి జీవితంలోని అన్యోన్యతకు గల రహస్యాలను కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. రామ్ చరణ్ తో వాలెంటైన్స్ డే నాకు ఎప్పుడూ ప్రత్యేకమైంది అంటూ మనకు ఇష్టమైన వారితో ఆ బంధం బలంగా ఉండేందుకు ఈ టిప్స్ మీరు తప్పక ఫాలో అవ్వాలి అని ఉపాసన తెలియజేసింది.

ఆ విషయంలో శ్రద్ధ

ముఖ్యంగా వివాహ బంధంలో ఆరోగ్యం అనేది ప్రధానాంశం మన ఆరోగ్యంపై ఎల్లపుడు కూడా శ్రద్ధ వహిస్తూ ఉండాలి. వీలైనంత వరకూ ప్రతిరోజూ సరైన సమయంలో నిద్రపోతూ ఉండాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ప్రియమైన వారితో ఏమాత్రం గ్యాప్ దొరికిన కూడా సమయాన్ని వారితో గడపండి. ఇది తరచుగా అలవాటు చేసు కుంటూ ఉండాలి అన్నారు.

పెళ్లిళ్లు స్వర్గంలో కాదు..

పెళ్లిళ్లు స్వర్గంలో కాదు..

డిన్నర్ లేదా సినిమాలు చూడడం లేదా కాలక్షేపంగా కబుర్లు చెప్పుకోవడం ఇలాంటివి మీ జీవిత భాగస్వామితో అలవరచు కోవాలి. అప్పుడు ఆ అనుబంధం మరింత అందంగా మారుతుంది. ఇప్పటివరకు మీరు అది ఫాలో కాకపోతే ఇక నుంచైనా రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. నిజానికి అందరూ కూడా పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తారు అంటారు కానీ ఒక విధంగా అది నిజం కాదు ఇద్దరు వ్యక్తులు ఈ భూమ్మీద ఎంతో కష్టపడితేనే పెళ్లికి పునాది అనేది పడుతుంది. ఎక్కువగా ఎదుటివారిపై ప్రేమ గౌరవం చూపిస్తే ఆ బంధం చాలా చక్కగా ఉంటుంది అని వివరణ ఇచ్చారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X