రేపు సంధ్యా థియేటర్‌కు వస్తున్న రామ్ చరణ్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రేపు(జనవరి 3) చిక్కడపల్లి సెంటర్లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్యా థియేటర్‌కు రాబోతున్నారు. తన తాజా సినిమా 'ఎవడు' థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసారు. సాయంత్రం 5 గంటలకు అభిమానులు, సినీ ప్రియుల సమక్షంలో రామ్ చరణ్ ఈ ట్రైలర్ విడుదల చేయనున్నారు.
రామ్ చరణ్ రాకను పురస్కరించుకుని భారీగా అభిమానులు రానున్న నేపథ్యంలో.....ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో రేపు సాయంత్రం ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సక్రాంతి కానుకగా 'ఎవడు' చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో.....ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఏర్పాటు చేసారు.

రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో తెరకెక్కించిన చిత్రం 'ఎవడు'. దిల్ రాజు మాట్లాడుతూ...'ఎవడు' చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నాం. దీనికి సంబంధించిన స్పెషల్ టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది' అన్నారు.
ఈ చిత్రంలో జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయికుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ : వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ, మాటలు : అబ్బూరి రివి, కథ సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్: సెల్వం, ఆర్ట్ : ఆనంద్ సాయి. సహ నిర్మాతలు: శిరీష్ లక్ష్మణ్, నిర్మాత: రాజు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











