Don't Miss!
- News
ఈ టర్మ్‌లో ఇదే చివరిది- తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు..!!
- Sports
నేను అనుకున్న సవాల్ ఎదురవ్వలేదు.. అతి త్వరలోనే సెంచరీ కొడతా: రోహిత్ శర్మ
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఇలా ఏర్పరచుకోండి
- Finance
Wipro Layoffs: ఫ్రెషర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. 452 మంది తొలగింపు..
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Technology
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
ఉపాసన బర్త్ డే.. క్యూట్ గా విషెస్ చెప్పిన రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ భార్య ప్రముఖ సామాజిక కార్యకర్త ఉపాసన కొణిదెల 20వ తేదీన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా ఆమె పేరిట రామ్ చరణ్ యువ శక్తి తరపున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం నిర్వహించడమే కాక పలు ప్రాంతాల్లో అన్నదానం కూడా నిర్వహించారు. అదేవిధంగా ఆమె పేరిట పలుచోట్ల మొక్కలు కూడా నాటి ఆదర్శంగా నిలిచారు. అంతేకాక రామ్ చరణ్ యువ శక్తి తరఫున వరదలలో నిరాశ్రయులైన వారికి కొంత ఆర్థిక సహాయం అలాగే వస్త్ర సాయం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక తన భార్య పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తేజ తన కుటుంబ సభ్యులందరికీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని తెలుస్తోంద.
ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన తండ్రి చిరంజీవి తల్లి సురేఖ భార్య ఉపాసనతో కలిసి ఉన్న ఒక అద్భుతమైన ఫోటోని షేర్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఉపాసనకు కేవలం మెగా ఫ్యామిలీ, మెగా అభిమానుల నుంచే కాక మిగతా హీరోల అభిమానులు అలాగే మిగతా నెటిజన్లు కూడా ఆమెకు శుభాకాంక్షలు వెలుగులా కురిపిస్తున్నారు. ఉపాసన సామాజిక సేవకురాలిగా, అపోలో ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్న ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ఆమె భాగం అవుతుంది.

ఒక పక్క ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఆదివాసులు, గిరిజనులతోనూ మమేకమవుతూ ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. అదే సమయంలో అపోలో ఆసుపత్రుల ద్వారా తనవంతు సేవని అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక కెరీర్ పరంగా ఓ పెద్ద సంస్థలో టాప్ పొజిషియన్‌లో ఉంటూనే మరోవైపు ఇల్లాలిగా మెగా ఫ్యామిలీలో ఒదిగిపోతుంది ఆమె. ఇక మరోవైపు చిరంజీవి సైతం కోడలు ఉపాసనకి బర్త్ డే విషెస్ తెలిపారు. మా ఇంటి కోడలు పిల్ల ఉపాసనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు.