Just In
- 5 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 6 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 6 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 6 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వీడియో వైరల్ : ఆమె రామ్ చరణ్ కూతురట.. ఓ రేంజ్లో ఆడుకుంటోన్న నెటిజన్స్
రామ్ చరణ్-ఉపాసనలకు వారసుడు పుట్టాలని, ఇంకా ఎప్పుడు బుల్లి రామ్ చరణ్‌ను చూస్తామని కొన్ని కోట్ల మంది అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అలాంటిది రామ్ చరణ్ కూతురు అంటూ ఓ ప్రముఖ మూవీ మ్యాగజైన్ ప్రచురిస్తే ఫ్యాన్స్ అందరూ రియాక్ట్ కాకుండా ఉంటారా? ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. కనీసం ఏమీ తెలియకుండా ఎలా రాస్తారంటూ మండిపడుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం.

మెగా ఇంట్లో నవిష్క..
చిరు చిన్న కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లకు పుట్టిన పాప నవిష్క. నవిష్క ఎంట్రీతో మెగా ఇంట్లో సందడి మరింత రెట్టింపైంది. నవిష్కకు సోషల్ మీడియాలో భారీగా పాపులారిటీ వచ్చేసింది. నవిష్క బారసలకు పవన్ భార్య, మెగా ఫ్యామిలీ అందరూ హాజరవడం, వాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే.

నవిష్కతో చిరు సందడి..
ఆ మధ్య లాక్ డౌన్ కాలంలో చిరు నవిష్కతో సందడి చేశారు. నవిష్క తన తాత పాటలను ఏవిధంగా ఆస్వాధిస్తుందో అందరికీ చూపించాడు చిరు. ఖైదీ నెంబర్ 150 పాటలను ప్లే చేస్తే నవిష్క ఎంత సంతోషంగా ఉందో చూపించాడు. ఆ పాటలను ఆపేస్తే నవిష్క ఏడ్వడం, మళ్లీ పెడితే ఆనందంగా గంతులు వేయడం మనమంతా చూశాం.

ముద్దుల మామయ్య..
తాజాగా నవిష్క తన ముద్దుల మావయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. మామ రామ్ చరణ్ ఆధ్వర్యంలో నవిష్క క్యూట్ స్టెప్పులు వేస్తోంది. వీటికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నేటి ఉదయం నుంచి తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోపై ఫిల్మ్ ఫేర్ అనే సంస్థ తన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది.

రామ్ చరణ్ కూతురు నవిష్క..
రామ్ చరణ్ కూతురు నవిష్క అంటూ సదరు సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. తన కూతురితో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడని తెలిపింది. దీంతో సదరు సంస్థపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ వీడియో కంటే ఆ సంస్థ చేసిన ట్వీట్ మరింత రచ్చగా మారింది.

నెటిజన్స్ ఫైర్..
మామ అయిన రామ్ చరణ్‌ను.. నవిష్కకు తండ్రిగా రాయడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కనీస విషయాలు, బంధుత్వాలు కూడా తెలుసుకోకుండా ఎలా రాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలియక పోతే ఇలాంటి పనులు చేయకూడదని, మీమ్స్‌తో నానా రచ్చ చేస్తున్నారు.