బోయపాటి పాటి దర్శకత్వంలో రామ్ చరణ్!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో క్రేజీ దర్శకుడితో జతకట్టబోతున్నాడు. భద్ర, తులసి, సింహా లాంటి మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటితో సినిమా చేయబోతున్నాడు. 2013 ద్వితీయార్థంలో ఈచిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో నెం.1 స్థానానికి ఎదగాలంటూ ముందు మాస్ ప్రేక్షకుల మెప్పించాలి. దీంతో ఆ కోవకి చెందిన దర్శకులతో చేయడానికి చెర్రీ ఇంట్రస్టు చూపుతున్నాడు.
రామ్ చరణ్ కి దర్శకుడు బోయపాటి చెప్పిన కథ చాలా బాగా నచ్చిందనీ, తన అంగీకారాన్ని కూడా తెలియజేశాడని సమాచారం. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వై. జయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తారి భోగట్టా. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ వివి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు వంశీ పడి పల్లి దర్శకత్వంలో 'ఎవడు', బాలీవుడ్లో జంజీర్ చిత్రంలో కూడా చెర్రీ నటిస్తున్నాడు. మొత్తానికి 2013 సంవత్సరంలో రామ్ చరణ్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాలో ఒకే సంవత్సరంలో విడుదల కానున్నాయి. అదే విధంగా మరికొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయి.
చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'జంజీర్' చిత్రం వివరాల్లోకి వెళితే... రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి కూడా ముఖ్య పాత్రలు పోస్తున్నారు. ఈ చిత్రం హిట్టయితే బాలీవుడ్లో జెండా పాతడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











