రామ్ చరణ్ నిన్నంతా ఇలా...(ఫొటో)
హైదరాబాద్: రామ్ చరణ్ నిన్న ఆదివారం ఎలా గడిపాడు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆయనకు కుక్కపిల్లలంటే ఇష్టం. ఆ మధ్యనే కుక్కలు అంటే ఎంతో ఇష్టపడే రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఇప్పటికే ఓ కుక్కను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మూడు కుక్కలను కూడా తీసుకొచ్చారు. ఇవి తమ కుటుంబంలోకి మరింత సంతోషాన్ని తెచ్చాయని రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్టు చేసాడు. ఇప్పుడు ఆదివారం అంతా వాటితో గడిపారు. ఆ విషయాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్ చేసి,ఫొటో పోస్ట్ చేసారు.
రామ్ చరణ్ తాజా సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా విషయానికొస్తే...
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . కాజల్ హీరోయిన్. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. ఈ మధ్యనే ఈ చిత్రం టీజర్ విడుదల చేసారు. మంచి క్రేజ్ వచ్చింది.

ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుద, శ్రీకాంత్ నటిస్తున్నారు. తొలుత రాజ్ కిరణ్‌ను ఎంపిక చేసినప్పటికీ...తర్వాత అతని స్థానంలో ప్రకాష్ రాజ్‌ను తీసుకుని ఆయనకు సంబంధించిన సీన్లు రీ షూట్ చేసారు. ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఫ్యామిలీ హీరోగా కనిపించనున్నాడు.
అక్టోబర్ 1న సినిమా విడుదలవుతోంది. కెరీర్లో తొలి దసరా రిలీజ్. సూపర్ ఎగ్జైటెండ్' అంటూ రామ్ చరణ్ సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రంలో చరణ్ పల్లెటూరికి వచ్చే ఎన్నారై పాత్రలో నటిస్తున్నారు.రామ్ చరణ్ తేజ్, కాజల్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా. ఇంతకు ముందు 'మగధీర', 'నాయక్' చిత్రాల్లో కలిసి నటించారు.


Click it and Unblock the Notifications











