రామ్ చరణ్, ఉపాసన తొలిసారిగా...
గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్..రామ్ చరణ్, ఉపాసన.వారిద్దరిమీదే మీడియా దృష్టి మొత్తం కేంద్రీకృతం అయి ఉంది. తాజాగా కాబోయే శ్రీమతి ఉపాసనతో కలిసి రామ్ చరణ్ తొలిసారి జనం ముందుకు వచ్చారు. రామ్‌చరణ్ తను కొనుగోలు చేసిన పోలో జట్టు ఆటను తిలకించేందుకు వచ్చారు. సికింద్రాబాద్‌లోని పోలో క్రీడా మైదానంలో మంగళవారం సాయంత్రం ఈ పోటీ జరిగింది. ఆ సందర్భంగా చరణ్, ఉపాసన ఆసక్తికరంగా ఆటను తిలకిస్తూనే కబుర్లు చెప్పుకొంటూ గడిపారు. పోలో చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కాబోయే జంటను కూడా తిలకించారు.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.


Click it and Unblock the Notifications











