రామ్ చరణ్ ‘ఎవడు’ ఫస్ట్ లుక్(ఫోటోలు)
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసారు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పలు కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారు. వేసవి చివరలో విడుదల చేయడమే లక్ష్యంగా త్వరిత గతిన సినిమా షూటింగ్ పనులు పూర్తి చేస్తున్నారు.
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజునుమార్చి 27) పురస్కరించుకుని 'ఎవడు' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో వైపు చెర్రీ నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'జంజీర్'(తెలుగులో తుఫాన్) చిత్రం ఎవడు చిత్రం తర్వాత దాదాపు 50 రోజుల గ్యాప్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది.

రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ డేట్ ఖరారైనట్లు వార్తలు అందుతున్నాయి. మే 9వ తేదీన ఆడియో విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

రామ్ చరణ్-ఉపాసన మొదటి పెళ్లి రోజైన జూన్ 14వ తేదీన ‘ఎవడు' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘ఎవడు' చిత్రానికి చెర్రీ బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.

జగదేక వీరుడు- అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ లాంవటి మెమోరెబల్ సినిమాల విడుదలైన రోజైన మే 9వ తేదీన ‘ఎవడు' చిత్రం ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











