చెర్రీ బాలీవుడ్ మూవీ అపూర్వ లఖియా దర్శకత్వంలో

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ మూవీ 'జంజీర్'కు ఇది రీమేక్. ఈ చిత్రానికి దర్శకుడుగా అపూర్వ లఖియా ఖరారయ్యాడు. రిలయన్స్, బాలాజీ, ఈరోస్ సంస్థలతో కలిసి అమిత్ మెహ్రా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. విక్రమ్ భట్ సోదరుడు చిరాన్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు. ప్రస్తుతానికి కథా చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటుల ఎంపిక జరుగనుంది.

1974లో మే 11న విడుదలై జంజీర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరక్కించబోతున్నారు.

రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ హిట్టయితే....మెగా వారసుడిగా కొన్ని రోజుల తర్వాత తండ్రిని మించిన తనయుడు కావడం ఖాయం అనే వాదన అభిమానుల్లో వినిపిస్తోంది. చిరంజీవి కూడా కొడుకు భవిష్యత్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, అసలు చరణ్ బాలీవుడ్ ఎంట్రీ వెనక ఉన్న వ్యక్తి చిరంజీవే అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X