రామ్ చరణ్ హిందీ చిత్రం ముహూర్తం డేట్ ఫిక్స్
రామ్ చరణ్ త్వరలో హిందీ చిత్రం జంజీర్ రీమేక్ లో చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏప్రియల్ 20 న షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆ రోజు నుంచి పదిరోజులు పాటు రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వివి వినాయిక్ తో చేస్తున్న చిత్రం గ్యాప్ లో ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం వినాయిక్ చిత్రం షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. దాంతో వంశీ పైడిపల్లి దర్సకత్వంలో రూపొందే ఎవడు చిత్రం షూటింగ్ కి వెళ్లనున్నాడు. మరో ప్రక్క రచ్చ చిత్రం ప్యాచ్ వర్క్ లలో పాల్గొంటున్నాడు.
ఇక బాలీవుడ్ చిత్రం గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. ఇక మిగతా వివరాలు చెప్పటానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఈ జంజీర్ చిత్రం రీమేక్ ని రిలియన్స్ బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మించనున్నారని,అపూర్వ లకియా దర్శకత్వంలో రూపొందనుందని తెలుస్తోంది. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు.
అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు. అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టు లో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అయ్యిన స్టార్ హీరోయిన్ ని రామ్ చరణ్ ప్రక్కన తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ జంజీర్ చిత్రం రీమేక్ ని రిలియన్స్ బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











