twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ‘తుఫాన్, జంజీర్’ రైట్స్ రూ. 50 కోట్లు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ జంజీర్ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్. ఈ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన తుఫాన్ ట్రైలర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ రావడంతో....తెలుగు వెర్షన్ 'తుఫాన్' ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్, హిందీ వెర్షన్ 'జంజీర్' నైజాం రైట్స్ కలిసి భారీ మొత్తానికి అమ్మడయ్యాయి.

    ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ రూ. 50 కోట్లు వెచ్చించి ఈ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉండటం, నైజాం ఏరియా పరిధిలో మహారాష్ట్రలోని మట్వాడా, ఔరంగబాద్, షోలాపూర్ లాంటి ప్రదేశాలు ఉండటంతో జంజీర్ హిందీ రైట్స్‌తో కలిసి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

    రామ్ చరణ్ గత సినిమాల మార్కెట్ పరిశీలిస్తే...రచ్చ సినిమా రూ. 40 కోట్లు, నాయక్ చిత్రం రూ. 43 కోట్లు అమ్మడయి మంచి మార్కెట్ వసూళ్లను సాధించాయి. తాజాగా 'తుఫాన్' చిత్రం రూ. 50 కోట్లకు అమ్ముడవడంతో రామ్ చరణ్ సినిమాల మార్కెట్ శరవేగంగా పుంజుకుంటోందని చెప్పవచ్చు.

    తెలుగు వెర్షన్ 'తుఫాన్' చిత్రాన్ని మొత్తం 1000కి పైగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా హిందీ వెర్షన్‌ను 200 థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం జంజీర్/తుఫాన్ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో ఓ సరికొత్త అధ్యాయానికి తెరతీయడం ఖాయంగా కనిపిస్తోంది.

    English summary
    Director Apoorva Lakhia's bilingual movie, which is remake of 1973 film Zanjeer, is simultaneously made in Hindi as Zanjeer and Telugu as Toofan. It marks Ram Charan and Priyanka Chopra's acting debut in Hindi and Telugu, respectively. It has been creating a positive buzz ever since it went on the floor. The latest we hear is that its rights for Telugu remake and distribution have been sold for Rs 50 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X