Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్‌మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ చరణ్ ‘తుఫాన్, జంజీర్’ రైట్స్ రూ. 50 కోట్లు
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ జంజీర్ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్. ఈ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన తుఫాన్ ట్రైలర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ రావడంతో....తెలుగు వెర్షన్ 'తుఫాన్' ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్, హిందీ వెర్షన్ 'జంజీర్' నైజాం రైట్స్ కలిసి భారీ మొత్తానికి అమ్మడయ్యాయి.
ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ రూ. 50 కోట్లు వెచ్చించి ఈ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉండటం, నైజాం ఏరియా పరిధిలో మహారాష్ట్రలోని మట్వాడా, ఔరంగబాద్, షోలాపూర్ లాంటి ప్రదేశాలు ఉండటంతో జంజీర్ హిందీ రైట్స్‌తో కలిసి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ గత సినిమాల మార్కెట్ పరిశీలిస్తే...రచ్చ సినిమా రూ. 40 కోట్లు, నాయక్ చిత్రం రూ. 43 కోట్లు అమ్మడయి మంచి మార్కెట్ వసూళ్లను సాధించాయి. తాజాగా 'తుఫాన్' చిత్రం రూ. 50 కోట్లకు అమ్ముడవడంతో రామ్ చరణ్ సినిమాల మార్కెట్ శరవేగంగా పుంజుకుంటోందని చెప్పవచ్చు.
తెలుగు వెర్షన్ 'తుఫాన్' చిత్రాన్ని మొత్తం 1000కి పైగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా హిందీ వెర్షన్‌ను 200 థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం జంజీర్/తుఫాన్ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో ఓ సరికొత్త అధ్యాయానికి తెరతీయడం ఖాయంగా కనిపిస్తోంది.