Game Changer: రిలీజ్ డేట్ ప్రకటించకపోతే చస్తా.. రామ్ చరణ్ ఫ్యాన్ సూసైడ్ నోట్

గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక 2025లోనే ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ వీరాభిమాని నిర్మాతలకు సూసైడ్ నోట్ పంపించాడు. విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వకపోతే.. చనిపోతానంటూ బెదిరించాడు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఇక ఈ చిత్రానికి దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తుండగా... కియరా అడ్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.

Game Changer:

ఇక గేమ్ ఛేెంజర్ మూవీ ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉండే. కానీ రామ్ చరణ్ తండ్రి కావడం... దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాపై దృష్టి పెట్టడం.. ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి, లేదా సమ్మర్ రేసులో అయినా ఉండాల్సిన ఈ సినిమా... వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయనకు ఫుల్ క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. మరి ఆయన నెక్ట్స్ మూవీ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆయన సినిమా మాత్రం డిలే అవుతూ వస్తోంది. ఇక రిలీజ్ డేట్ మీద స్పష్టత లేకపోవడంతో.. ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఒక రామ్ చరణ్ ఫ్యాన్ అయితే నిర్మాతలకు ఓ బెదిరింపు లేఖను రాశారు.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమాని సూసైడ్ నోట్ రాసి నిర్మాతలకు పంపించాడు. గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్, విడుదల మాటి మాటికీ వాయిదా పడటంతో మనస్తాపానికి గురైన ఒక అభిమాని చస్తా అంటూ బెదిరించాడు. చిత్ర నిర్మాతకి, దర్శకుడికి మూడు రోజుల అల్టిమేటం జారీ చేశాడు. ఈలోగా విడుదల తేదీ ప్రకటించకపోతే చస్తా అని బెదిరిస్తున్నాడు. ప్రస్తుతం అతను రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సూసైడ్ నోట్ లో ఏం రాశాడండే... నేను ఈ కఠినమైన నిర్ణయం ఎందుకు ఎంచుకున్నాను అంటే... రామ్‌చరణ్ వీరాభిమానిగా దాదాపు రెండేళ్లుగా రాబోయే సినిమా "గేమ్ ఛేంజర్" రిలీజ్ డేట్ కోసం ఓపికగా ఎదురుచూశాను. దురదృష్టవశాత్తు, ప్రొడక్షన్ టీమ్ నుంచి ఎటువంటి అప్‌డేట్‌లు లేవు. సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి నేను వారికి మూడు రోజులు గడువు ఇస్తున్నాను. లేదంటే నా జీవితాన్ని ముగించేస్తాను. అదే జరిగితే నా చావుకు ప్రధాన బాధితులు శంకర్ షణ్ముగం, దిల్ రాజు అండ్ SVC ప్రొడక్షన్ హౌస్‌లే కారణం. మీరు నా నిర్ణయాన్ని అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. లవ్ యు చరణ్ అన్న, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నా తదుపరి జీవితంలో నేను మీకు మంచి అభిమానిని అవుతానని ఆశిస్తున్నాను, ఇట్లు బాబు గౌడ్ అంటూ రాసుకువచ్చాడు. మరి ఈ అభిమాని లేఖతో అయినా గేమ్ ఛేంజర్ నుంచి ఏమైనా అప్డేట్లు వస్తాయో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X