ముంబయి పోలీసుల చేతిలో ఇరుక్కున్న హీరో రామ్
హీరో రామ్ ని తాజాగా ముంబయిలో టెర్రరిస్టుగా పొరబడి పోలీసులు అరెస్టు చేయబోయారు. దిల్ రాజు నిర్మిస్తున్న రామ రామ కృష్ణ కృష్ణ చిత్రం కోసం రామ్ ముంబయి ట్రిడెంట్ హోటల్ వద్ద షూటింగ్ జరుపుతున్నారు. లక్ష్యం వాసు దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ కోసం ఫర్మిషన్ తీసుకున్నారు. అయితే అక్కడ తీస్తున్నది ఛేజ్ సీన్. నలుగురు వెంబడిస్తూంటారు. అక్కడ లాస్ట్ ఇయిర్ బాంబ్ ప్రేలుళ్లు జరగటంతో లోకల్ పోలీసులు చాలా ఎలర్ట్ గా ఉన్నారు.దాంతో వారు టెర్రరిస్ట్ గా రామ్ ని పొరపడ్డారు. వారు తుపాకీలు తీసి రామ్ కు గురిపెట్టారు. చివరకు యూనిట్ సభ్యులు, దర్శకుడు వచ్చి అక్కడ వారికి వివరించారు. కాస్సేపటికి ఐడెంటిటీ,షూటింగ్ పత్రాలు చూపి ఇష్యూలు క్లియర్ చేసారు. ఇక ఈ విషయాలన్నీ హారో రామ్ తన బ్లాగ్ లో రాసుకున్నారు.
అలాగే రామ్, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి దర్శకత్వంలో టామ్ అండ్ జెర్రి అనే వెరైటీ టైటిల్ పెట్టరనే సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ, మాటలు అందించనున్నారు. అశోక్ నుండీ వక్కంతం కథతోనే సురేంద్రరెడ్డి ముందుకు సాగుతున్నారు. కిక్ చిత్రంలాగే ఈ సినిమా కూడా ఫుల్ లెంగ్త్ కామీడీతో నడవనుందని తెలుస్తోంది. జనవరి నుంచీ ఈ చిత్రం సెట్స్ కు వెళ్ళనుంది. ఇక స్రవంతి బ్యానర్ లో రామ్ హీరోగా గణేష్ అనే చిత్రం తీసారు..భాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం నెగిటివ్ ఫలితాన్ని నమోదు చేసింది..రామరామ కృష్ణ కృష్ణ చిత్రంలో అర్జున్ మరో ముఖ్యపాత్ర చేస్తున్నారు. సురేంద్ర రెడ్డి కొత్త ప్రాజెక్టు పిబ్రవరి 2010 నుంచి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











