ఎన్టీఆర్ 'ఊసరివిల్లి' పైనే రామ్ కామెంట్?
ఎన్టీఆర్, సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఊసరవిల్లి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం నిజానికి మొదట స్రవంతి బ్యానర్ లో ఓకే చేసారు. రామ్,జెనిలియా కాంబినేషన్ లో టామ్ అండ్ జెర్రీ టైటిల్ తో చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేసారు.అయితే చాలా కాలం స్టోరీ సిట్టింగ్ లపై కూర్చున్నా స్రవంతి రవికిషోర కి కానీ, రామ్ కి కానీ కథ నచ్చలేదు. దాంతో అప్పట్లో ఆ ప్రాజెక్టుని వదులుకున్నారు. సురేంద్ర రెడ్డి కి ఇచ్చిన అడ్వాన్స్ ని కూడా వెనక్కి తీసుకున్నట్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత సురేంద్ర రెడ్డి అదే కథను పట్టుకుని ఎన్టీఆర్ ని పట్టుకుని తమన్నా, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఊసరవిల్లి చిత్రం ప్రారభించారు. అది మనస్సులో పెట్టుకున్నాడో ఏమో కానీ రామ్ అవకాశం దొరికినప్పుడల్లా...జగడం సినిమా తరవాత పదిహేను నెలలు విశ్రాంతి తీసుకొని, బాగా ఆలోచించి 'రెడీ' సినిమా చేశాను. బాగా ఆడింది.
ఇప్పుడు 'రామ రామ కృష్ణ కృష్ణ' తరవాత అంతే విరామం తీసుకొని మంచి కథ కోసం వెతికాను. ఈ 'కందిరీగ' చిత్రం చేస్తున్నాను అన్నారు. అంటే ఇండైక్ట్ గా నేను వదిలేసిన కథని ఎన్టీఆర్ చేస్తున్నాడనే రామ్ గుర్తు చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో అంటున్నారు. అందులోనూ ఎన్టీఆర్ తో సురేంద్రరెడ్డి చేస్తున్న ఊసరవిల్లి బాగా వస్తోందని టాక్ రావటం కూడా రామ్ కు మింగుడు పడటం లేదని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కందిరీగ ప్రమోషన్ లో ఉన్న రామ్ ఆ తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. రామ్.రామ్,హన్సిక ల కాంబినేషన్ లో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం 'కందిరీగ' త్వరలోనే విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











