కోన వెంకట్ మాటలు ఖండిచిన హీరో రామ్
రచయిత కోన వెంకట్ రీసెంట్ గా రామ్ తాజా చిత్రం కందిరీగ గురించి మాట్లాడుతూ... ఇది రెడీ కి సిక్వెల్ లాంటిది అన్నారు. అయితే అది రామ్ కి నచ్చినట్లు లేదు. ఆయన ఈ మాటలను ఖండిస్తూ... రెడీకి ఈ చిత్రానికి సంభందం లేదు. సీక్వెల్ అస్సలు కానే కాదు. ఆ సినినాకు కందిరీగ కు అస్సలు పోలిక లేదు. రెండూ ఎంటర్టైనర్ మాత్రమే. అలాగే రెండింటికి ఒకే ఒక పోలిక అదే నేను రెండింటిలోనూ హీరోను కావటం అని తేల్చేసారు.
అలాగే తాను రామ రామ కృష్ణ కృష్ణ చిత్రం విడుదలయ్యాక చాలా కాలం పాటు మంచి స్క్రిప్టు కోసమే ఆగి ఈ సినిమా కమిటయ్యారని అన్నారు. జగడం' తర్వాత పదిహేను నెలలు విరామం తీసుకొని 'రెడీ' చేశాను. ఆ చిత్రం పెద్ద హిట్. అలాగే ఈ సినిమా 'రామరామ కృష్ణకృష్ణ' తర్వాత అంతే గ్యాప్ తీసుకొని చేశాను. ఈ సినిమా కూడ పెద్ద హిట్ అవుతుందని, ఇందులొ పని చేసిన వారందరికి మంచి పేరు తెచ్చి పెడుతుంది అన్నారు.
కందిరిగ అభిమానుల అంచనాలుకు మించి ఉంటుందని చెప్పారు. అలాగే దర్సకుడు కొత్త వాడైనా టెర్రఫిక్ గా తీసాడని మెచ్చుకున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రంలో హన్సిక,అక్ష హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్..శీను గా కనిపిస్తాడు. పెద్దగా చదువు, సంధ్యాలేని శీను అల్లరి చిల్లరిగా తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు.'నా పేరు శీను... నాక్కొంచెం టెంపరెక్కువ' అని చెప్పుకోవటం ఇష్టపడుతూంటాడు. ఎలాంటి విషయంలోనైనా మొండిగా దూసుకుపోయే అతనికి ప్రేమ మీద నమ్మకం ఉండదు. అలాంటివాడు అనుకోని పరిస్ధితుల్లో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి కథ మలుపుతిరుగుతుంది.


Click it and Unblock the Notifications











