ఎన్టీఆర్ 'రభస' విషయమై హీరో రామ్ ఖండన

రామ్ ట్వీట్ లో... " ఈ న్యూస్ వెనకాల ఏ క్రియేటివ్ హెడ్ ఉఓన్నారో నాకు తెలియదు...నేను ఏ విధమైన కేసు ఎవరి సినిమాని ఆపుచేయమని వేయలేదు..దాన్ని పట్టించుకోవద్దు (I don't know which "Creative" head came up with this News But I haven't filed any case on anyone stopping any Film Shoot..Pls IGNORE..TY)" అని ట్వీట్ చేసారు.
ఇక ఎన్టీఆర్ తాజా చిత్రం రభసని ఆపే ప్రయత్నం రామ్ చేస్తున్నాడంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ,వెబ్ మీడియాలో రూమర్స్ వినపడ్డాయి. అయితే దీనికి కారణం...నిర్మాత బెల్లంకొండ సురేష్ కి,హీరో రామ్ కి ఉన్న విభేధాలే అంటున్నారు. గతంలో రామ్,నిర్మాత బెల్లంకొండ సురేష్ మధ్య రెమ్యునేషన్ విషయంలో వివాదం మొదలైన సంగతి తెలిసిందే.ఈ వివాదాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అశోషియేషన్ వద్దకు రామ్ తీసుకెళ్ళి కంప్లైంట్ చేసారు.
వరసగా మూడు డిజాస్టర్ ఫ్లాపులు(ఎందుకంటే ప్రేమంట,ఒంగోలు గిత్త,మసాలా) అందించిన రామ్ ప్రస్తుతం వెంకటాద్రి ఎక్సప్రెస్ దర్శకుడుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే తనతో గతంలో గణేష్ చిత్రం రూపొందించిన తమిళ దర్శకుడుతో కూడా కథ విషయమై డిస్కషన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. విజయ్ మిల్టన్ అనే తమిళ దర్శకుడు సైతం రామ్ తో సినిమాలు చేసే రేసులో ఉన్నారు.


Click it and Unblock the Notifications











