అద్బుతమైన కాంబో, రామ్ దిల్ రాజు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే
Recommended Video

దిల్ రాజు కాంపౌండ్ ఈమధ్య కొత్త కొత్త కాంబినేషన్లని సెట్ చేస్తోంది. అందులో భాగంగా రామ్ - త్రినాథరావు నక్కిన కాంబోలో ఓ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన వెలువడింది. అయితే ఈ సినిమాకోసం దర్శకుడు త్రినాథరావు తనకి అచ్చొచ్చిన ఫార్ములాని ఎంచుకొన్నాడని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.

మంచి హిట్లు
త్రినాథరావు ఇదివరకు "సినిమా చూపిస్త మామా" - "నేను లోకల్" సినిమాల్ని తీశాడు. ఆ రెండు సినిమాలకీ మామాఅల్లుళ్ల మధ్య డ్రామానే హైలెట్. ఆ రెండూ కూడా మంచి హిట్లయ్యాయి. అందుకే ఇప్పుడు రామ్ తో తీస్తున్న సినిమా కథకీ మామా అల్లుళ్ల టచ్ ఇస్తున్నారని తెలుస్తోంది.

మేకింగ్ వాల్యూస్
రామ్ ఎనర్జీకి, త్రినాథరావు నక్కిన టేకింగ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేకింగ్ వాల్యూస్ తోడు కావడం సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రం లో చాలా కీలకమైన పాత్ర ఒకటి పోషిస్తున్నారు.

మామా అల్లుళ్ల వార్
ఒక ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రం లో నటిస్తారు. ఈ చిత్రానికి కధ ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నారు. మామా అల్లుళ్ల మధ్య వార్ అనేది ఎప్పుడూ మాస్‌ని అలరించే అంశమే. అది పక్కాగా సెట్ అయితే మాత్రం సినిమా హిట్టు ఖాయమని చాలా చిత్రాలు నిరూపించాయి.

మాస్ టచ్‌తో
మరి రామ్ అల్లుడి పాత్రలో ఎలా సందడి చేస్తాడో చూడాలి. త్రినాథరావు నక్కిన చిత్రాలకి ప్రసన్నకుమార్ అనే రచయిత కథల్ని అందిస్తుంటాడు. అతను మాస్ టచ్ తో కథల్ని రాయడంలో సిద్ధహస్తుడు. రామ్ కూడా మాస్ కథలతో సరైన హిట్టు అందుకుని చాలా కాలమైంది. అందుకే ఆయన ఈ సినిమా తనకి అన్ని రకాలుగా వర్కవుట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











