ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా: రామ్
ఈ సినిమాని మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా దర్శకుడు కె. విజయ్ భాస్కర్ ఫన్ కి అవకాసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. వెంకటేష్, రామ్ లు హాస్యాన్ని పండించడానికి ఇద్దరు పోటిపడి మరి నటించారని సమాచారం. గత కొంత కాలంగా ఈ సినిమా కోసం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి ' మసాలా' అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు లోగో త్వరలో విడుదలయ్యి ఈ ఊహలకు తెరదించనున్నాయి.
ఇక మొదట ఈ చిత్రానికి 'గరమ్ మసాలా' అన్నారు. ఆ తరవాత అది 'గోల్ మాల్'గా సురేష్ బాబు చెప్పారు. ఈమధ్య 'బ్లాక్ బస్టర్' అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఇద్దరు హీరోలు కాబట్టి 'రామ్ బలరామ్' అనే పేరు పెడితే ఎలా ఉంటుంది? అని కూడా ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ' మసాలా' హీరోలు ఇద్దరికి నచ్చిందని కాబట్టి అదే ఓకే చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం ఓ పేరు ఖరారు చేసి ప్రకటన చేసే అవకాసం ఉంది. ఇక ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.


Click it and Unblock the Notifications












