ఆ భయంతోనే ‘ఎందుకంటే ప్రేమంట’ ప్రీపోన్డ్
రామ్, తమన్నా జంటగా స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'ఎందుకంటే ప్రేమంట'. కరుణాకరన్ దర్శకత్వంలో పి.రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఈ చిత్రాన్నిమే 31న విడుదల చేస్తారని నిర్ణయించారు. అయితే తాజాగా విడుదల తేదీని మరింత ముందుకు జరిపారు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మే 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మే చివరన విడుదల చేస్తే వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్న నేపథ్యంలో కలెక్షన్లు తగ్గిపోతాయనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ కెరీర్ లో 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం ముఖ్య పాత్ర పోషించనుంది. ఈ చిత్రంతో రామ్ తమిళంలో పరిచయం కాబోతున్నారు.
గతంలో ఈచిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- యువతరాన్ని వెంటాడే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్‌ఫుల్‌గా చిత్రీకరిస్తున్నారని, జెనీవా స్విట్జర్లాండ్‌లలో షూట్ చేసిన పాటలు హైలెట్‌గా ఉంటాయని, మరో మూడు పాటలు చిత్రీకరించి వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.


Click it and Unblock the Notifications











