రామ్-తమన్నా సినిమా విడుదల తేదీ ఖరారు
ఎనర్జిటిక్ హీరో రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. స్రవంతి రవికిషోర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హీరో రామ్ చెప్పారు. అదే నెలలో మొదటి లేదా రెండో వారంలో ఆడియో విడుదల కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. అదే విధంగా ఈ చిత్రాన్ని తమిళంలో 'ఎన్ ఎండ్రల్ కాదల్ ఎన్‌బెన్' పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.
నిర్మాత మాట్లాడుతూ- యువతరాన్ని వెంటాడే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్‌ఫుల్‌గా చిత్రీకరిస్తున్నారని, జెనీవా స్విట్జర్లాండ్‌లలో షూట్ చేసిన పాటలు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.


Click it and Unblock the Notifications











