రామ్ 'ఎందుకంటే ప్రేమంట' షూటింగ్ పూర్తి

By Srikanya

రామ్, తమన్నా జంటగా కరుణాకరన్ దర్సకత్వంలో రూపొందిన చిత్రం 'ఎందుకంటే ప్రేమంట'. ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. బీదర్ లో లాస్ట్ షెడ్యూల్ తో ఈ షెడ్యూల్ పూర్తైంది. ఇక ఈ రోజే ఆడియో విడుదలకు సిద్దమవుతోంది. అన్నపూర్ణ ఏడెకరాలు స్టూడియోలో ఈ ఆడియో పంక్షన్ జరగనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం విజయంపై రామ్ చాలా నమ్మకంగా ఉన్నారు.

ఇర ఈ చిత్రం గురించి కరణాకరన్ మాట్లాడుతూ..అబ్బాయి రాసిన లేఖలో పిచ్చి రాతలన్నీ కవితల్లా కనిపిస్తే... అమ్మాయి చేత్తో ఇచ్చిన కషాయం కూడా కమ్మని పానీయంలా అనిపిస్తే... ఆ ఇద్దరూ తప్పకుండా ప్రేమలో ఉన్నట్టే. ప్రేమలోపడితే లోకమే గమ్మత్తుగా అనిపిస్తుంది. అదే విచిత్రాలు చేయిస్తుంది. ప్రేమలో పడిన ఓ జంటకూ ఇదే అనుభూతి కలిగింది. ఆ కథేమిటో తెలియాలంటే మా 'ఎందుకంటే ప్రేమంట'సినిమా చూడాల్సిందే అన్నారు.

నిర్మాత స్రవంతి రవికిషోర్‌ మాట్లాడుతూ ''ప్రేమలోని అనుభూతుల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆ క్షణాల్ని ఆస్వాదించాలంతే. మా సినిమాలో వాటిని వెండి తెరపై ఆవిష్కరించాం. రామ్‌ ఈ సినిమాతోనే తమిళంలో అడుగుపెడుతున్నాడు. రామ్‌ చెన్నైలోనే పుట్టి పెరిగాడు. తమిళ భాషపై మంచి పట్టు ఉంది. ఇక తమన్నా అక్కడి ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. ఈ ప్రేమ కథ అన్ని భాషలవారికీ నచ్చుతుంది. ఇటీవలే తమిళనాడులోనూ ప్రచారానికి శ్రీకారం చుట్టాము''అన్నారు.

ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హీరో రామ్ చెప్పారు. అదే విధంగా ఈ చిత్రాన్ని తమిళంలో 'ఎన్ ఎండ్రల్ కాదల్ ఎన్‌బెన్' పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. యువతరాన్ని వెంటాడే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్‌ఫుల్‌గా చిత్రీకరిస్తున్నారని, జెనీవా స్విట్జర్లాండ్‌లలో షూట్ చేసిన పాటలు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X