ఇంటి పేరు నచ్చని 'గణేష్'
'దేవదాసు' చిత్రం ద్వారా పరిచయమైన హీరో రామ్. చాలా ఎనర్జిటిక్ గా నటించే రామ్ ఆ తర్వాత చాలా ఫాస్ట్ గా స్టార్ డమ్ వైపు దూసుకుపోతున్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తున్న రామ్ ఖాతాలో 'రెడీ', 'మస్కా' వంటి హిట్ సినిమాలు వున్నాయి. తాజాగా రామ్ కథానాయకుడుగా నటిచిన చిత్రం 'గణేష్'. కాజల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలవబోతోంది. 'జస్ట్ గణేష్' అన్నది ఉపశీర్షిక. ఇందులో గణేష్ కు తన పేరు ముందు ఇంటి పేరు, పేరు తర్వాత రెడ్డి, నాయుడు లాంటి తోకలు ఉండటం నచ్చదట. అందుకే అందరికీ గణేష్..జస్ట్ గణేష్ అని చెబుతుంటాడట. అలాంటి యువకుడి జీవితంలోకి ఓ రోజు అందాల భామ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత గణేష్ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో తెరపైనే చూడాలంటున్నారు నిర్మాత 'స్రవంతి' రవి కిషోర్.
రామ్ కెరీర్ లోనే అత్యధిక ప్రింట్లతో ఈ సినిమా విడుదలవుతోంది. 'మస్కా' చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రాబట్టిన రామ్ 'గణేష్' చిత్రానికి బిజినెస్ వర్గాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రం ఒక్క హైదరాబాదులోనే 41 థియేటర్లలో విడుదలవుతోంది. స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే ఈ రేంజ్ లో విడుదలవుతాయి. ఈ చిత్రం గానీ మంచి విజయాన్ని సాధిస్తే రామ్ ఇమేజ్ మరింత పెరుగుతుందనటంలో సందేహం లేదు. ఆల్ ద బెస్ట్ రామ్.


Click it and Unblock the Notifications











