బెల్లంకొండకు ట్విస్ట్ ఇచ్చి రామ్ మొదలెట్టేసాడు
రామ్, బెల్లంకొండ సురేష్ మధ్య కందిరీగ రెమ్యునేషన్ విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మా సహకారంతో తన కోటి ని బెల్లంకొండనుంచి దక్కించుకున్న రామ్ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేస్తానని ఒప్పుకున్న సినిమాను చేయనని చెప్పి..ఆ సినిమాను ఇప్పుడు గౌతమ్ మీనన్ నిర్మాతగా మొదలెట్టేసాడు. రామ్, సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోమవారం చెన్నైలో లాంఛనంగా షూటింగ్ మొదలుపెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. తమిళంలో జీవా హీరోగా కనిపిస్తారు.
ఇక ఈ చిత్రానికి రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఫైనాన్స్ చేస్తాడని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో బెల్లంకొండ సురేష్ ఇప్పుడు రామ్ పేరు ఎత్తితే మండిపడుతున్నాడు. అతనిపై రివేంజ్ తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అందులో భాగంగానే రామ్ కి కందిరీగ ప్రమేషన్ కి ప్రక్కన పెట్టాడు. అంతేగాక సినిమాలో నటించిన సోనూసూద్ ని హైలెట్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. సోనూసూద్ బాగా చేసాడని, సినిమా అతనే నిలబెట్టాడని, అతన్ని హీరోగా పెట్టి సినిమా ప్లాన్ చేస్తానని అని చెప్పటం ద్వారా రామ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులోనూ వరస ప్లాప్ ల్లో ఉన్న రామ్ కి అంత ఖర్చు పెట్టి హిట్ ఇవ్వడం మామూలు విషయం కాదని అంటున్నాడు. ఈ నెగిటివ్ ప్రచారం రామ్ కి ఎంతవరకూ మైనస్ అవుతుందో కానీ అతను మాత్రం కూల్ గా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











