»   » మళ్లీ అదే తీసాడా? : వర్మ "ఎటాక్" ట్రైలర్

మళ్లీ అదే తీసాడా? : వర్మ "ఎటాక్" ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచు మోహన్ బాబు, విష్ణులతో పని చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం మంచు మనోజ్ ను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "ఎటాక్" అనే టైటిల్ ని పెట్టి రెండు రోజుల క్రితం మోషన్ పోస్టర్ విడుదల చేసారు.. ఇపుడు ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.

ఈ ట్రైలర్ ని చూసిన వారు రక్త చరిత్రకు ఇంకో వెర్షన్ లా ఉందని అంటున్నారు. దానికి తోడు ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వర్మ వాయిస్ ఓవర్ ..రక్త చరిత్రనే గుర్తు చేస్తున్నాయి. దాందే మరోసారి దాన్నే తిరగేసి తీసాడా అని విమర్శలు చేస్తున్నారు. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రతి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసే వర్మ, మనోజ్ సినిమాను కూడా తక్కువ సమయంలోనే పూర్తి చేసాడు. మనోజ్ పెళ్లికి ముందే షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ‘కరెంట్ తీగ' తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇదే.

జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, వడ్డే నవీన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సురభిని ఎంచుకొన్నారు. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌ చిత్రం 'బీరువా'తో తెలుగునాట అడుగుపెట్టింది సురభి. తొలి చిత్రంతోనే తన అందంతో, అభినయంతో ఆకట్టుకొంది.

Ram Gopal Varm's Attack Trailer

ఈ చిత్రం పూర్తి యాక్షన్ తో రూపొందనుందని సమాచారం. మంచు మనోజ్ లోని యాక్షన్ కోణాన్ని పూర్తిగ వాడుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దగ్గుపాటి రానా తో అనుకున్నారు...కానీ చివరి నిముషంలో సీన్ లోకి మంచు మనోజ్ వచ్చారు.

మనోజ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. చాలా కాలం క్రితం హీరో గా రిటైరయ్యి తప్పుకున్న వడ్డే నవీన్ ఇప్పుడు ఈ చిత్రంతో సీన్ లోకి వచ్చారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. మంచు మనోజ్, జగపతిబాబు కాంబినేషన్ లో కరెంట్ తీగ చిత్రం వచ్చింది. ఇప్పుడీ చిత్రం తెరకెక్కుతోంది.

English summary
A glimpse of “Attack” trailer of Manchu Manoj, Prakash Raj, Jagapathi Babu and Surabhi starrer “Attack” proves that it is a gripping tale of revenge set in Hyderabad oldcity. But the trailer makes people nostalgic about Ramu’s past movie Rakta Charitra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu