బాల్ థాక్రే లేకుంటే ‘సర్కార్’ సినిమా లేదు : వర్మ

By Bojja Kumar

ముంబై : బాల్ థాక్రే లేకుంటే 'సర్కార్' సినిమా లేదని, ఆయన స్ఫూర్తితోనే తాను ఆ చిత్రాన్ని రూపొదించానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన థాక్రేకు వర్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో బాల్ థాక్రేను పవర్ ఫుల్ వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా కొనియాడారు.

వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సర్కార్' జూన్, 2005లో విడుదలయింది. నిజ జీవితంలో తండ్రి-కొడుకులయిన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ సినిమాలో కూడా తండ్రి-కొడుకుల పాత్రలు పోషించారు. ఇది ద గాడ్ ఫాదర్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా నిర్మించింది అని వర్మ చెప్పిన్పటికీ....ఇది బాల్ థాక్రేను ఉద్దేశించి తీసిందే అని ఆప్పట్లోనే ప్రచారం సాగింది.

ఈ సినిమా మౌళికంగా పితృస్వామ్యము మరియు స్వాభిమానము గురించి అని వర్మ అభిప్రాయం. భారతీయ రాజకీయాల నేపథ్యములో తీసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తనదే ధర్మం అనుకునే రాజకీయనాయకుడు సర్కార్ పాత్రను పోషించాడు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X