twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణతో చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మ(ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: గతంలో ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో చిత్రాలు చేసి,విజయం సాధించి ప్రస్తుతం 'లెజండ్' సూపర్ హిట్ తో దూసుకుపోతున్న బాలకృష్ణ, రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో రక్త చరిత్ర, రౌడీ చిత్రాలు తీసిన వర్మ కాంబినేషన్ లో చిత్రం వస్తే ఎలా ఉంటుంది. ఈ కుతూహలం అటు వర్మ అభిమానులలోనూ, ఇటు బాలకృష్ణ అభిమానులలోనూ ఉంది. ఎందుకంటే వర్మ నేరేషన్ లో బాలకృష్ణని ఎంత పవర్ ఫుల్ గా చూపెడతారనేది అందరికీ ఆసక్తికరమైనదే.

    రామ్ గోపాల్ వర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో చిత్రం వస్తే ఎలా ఉండే అవకాసం ఉందంటూ ఆ మధ్యన జబర్ధస్ పోగ్రాం చేసారు. ఇప్పుడు నిజ జీవితంలో రామ్ గోపాల్ వర్మని ...బాలకృష్ణతో చిత్రం ఎప్పుడు అని అడిగేసారు. తన తాజా చిత్రం రౌడీ ప్రమోషన్ లో భాగంగా మీడియాని కలిసిన వర్మ ఈ విషయమై సమాధానమిచ్చారు.

    రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...బాలకృష్ణగారిని డైరక్ట్ చేసే స్ధాయి నాకు లేదు. ఆయన అభిమానుల్ని ఆనందింప చేసేంత సామర్ధ్యం నా దగ్గర లేదు అని తేల్చి చెప్పారు.

    ఇంకా వర్మ ఏం మాట్లాడారు అన్నది స్లైడ్ షో లో...

    చిరంజీవిపై కామెంట్ గురించి...

    చిరంజీవిపై కామెంట్ గురించి...

    చిరంజీవి హఠావో అంటే ఆయనను వ్యక్తిగతంగా అన్నానని ఎందుకనుకుంటున్నారు. ఇవాళ కాంగ్రేస్ ప్రచార సారధిగా చిరంజీవి అంటే కాంగ్రేస్. కాంగ్రేస్ అంటే చిరంజీవి. అందుకే చిరంజీవి హఠావో అనేసా.

    పవన్ ని ఎందుకు పార్టీ పెట్టాలన్నాను అంటే...

    పవన్ ని ఎందుకు పార్టీ పెట్టాలన్నాను అంటే...

    పవన్ కళ్యాణ్ బావుంటాడు కదా. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో పెద్ద అందంగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వస్తే చూడటానికైనా రాజకీయాలు బాగుంటాయని ...

    రాజశేఖర్ తో చిత్రం గురించి...

    రాజశేఖర్ తో చిత్రం గురించి...

    ఓ సందర్భంలో రాజశేఖర్,నేనూ ఇద్దరం కలిసాం. అనుకోకుండా సెట్టయ్యింది. షూటింగ్ తొమ్మిదింటికి అంటే...ఎనిమిదిన్నరకే లొకేషన్లో ఉండేవారాయన. అందుకే 24 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయగలిగాం.

    రౌడీ కథకి స్ఫూర్తి ...

    రౌడీ కథకి స్ఫూర్తి ...

    మోహన్‌బాబుగారే ఈ కథకి స్ఫూర్తి. ఆయనలోని ధైర్యం, దర్పం, సమాజానికి మంచి చేయాలనే గుణాలు చూసే 'అన్న' పాత్రని రాసుకున్నాను.

    విష్ణు నవ్వడు...

    విష్ణు నవ్వడు...

    పోస్టర్ పైనా, తెరపైనా హీరో అనవసరంగా నవ్వూతూ ఉంటే నాకు నచ్చదు. నా చిత్రాల్లో హీరోలు నవ్వినా అది సీరియస్ గానే ఉండాలి. అదే చెప్పా. ఈ సినిమాలో నువ్వు నవ్వటానికి వీల్లేదని కండీషన్ పెట్టా. అయినా మంచు విష్ణుని వినోదాత్మక హీరోగా చూడటానికి నాకు మనస్కరించదు. అందుకే విష్ణుతో పూర్తి సీరియస్‌ పాత్ర చేయించాను. ఇందులో విష్ణు ఒక్కసారి కూడా నవ్వడు అన్నారు.

    పార్టీకో, ప్రభుత్వానికో వ్యతిరేకం కాదు

    పార్టీకో, ప్రభుత్వానికో వ్యతిరేకం కాదు

    'రౌడీ' చిత్రం రాజకీయాలపై అస్త్రం కాదు. ఇది ఓ కుటుంబ కథా చిత్రం. ఈ క్రమంలో ప్రజల కష్టాల్ని చూపిస్తున్నాం తప్ప ఏ పార్టీకో, ప్రభుత్వానికో వ్యతిరేకం కాదు. వ్యవస్థ పనితీరుపై విమర్శలు కూడా చేయడం లేదు.

    విగ్ తీసేయమన్నా...

    విగ్ తీసేయమన్నా...


    నిజంగా మోహన్ బాబు చాలా మంచి వ్యక్తి. విగ్ తీసేసి నటించమని అడిగితే ఎవరూ అంత తేలిగ్గా అంగీకరించరు. కానీ ఆయన మారు మాట్లాడకుంటా విగ్ తీసేసారు. నా జీవితంలో ఇంత సాఫీగా పూర్తైన సినిమా ఇదే.

    శాన్విని హీరోయిన్ గా ఎంచుకోవడానికి కారణం

    శాన్విని హీరోయిన్ గా ఎంచుకోవడానికి కారణం

    విష్ణు పక్కన హీరోయిన్ గా నటించడానికి, నేను అనుకున్నట్లు పాత్రలో నటించేందుకు కావాల్సిన గుణాలు ఆమెలో ఉన్నాయి. అన్నింటికీ మించి ఆమె చాలా అందంగా ఉంది. ఇవి చాలవా?

    మానెయ్యలేదు..

    మానెయ్యలేదు..

    దెయ్యాల నేపథ్యంలో సినిమాలు తీయడం మానేయలేదు. మానేయను. కాస్త విరామం ఇచ్చాను. ప్రస్తుతానికి 'రౌడీ' మీద శ్రద్ధ పెట్టాను. దీని తర్వాత మళ్లీ దెయ్యాలు, ఆత్మల నేపథ్యంలో సినిమా చేసే అవకాశం ఉంది.

    నెక్ట్స్ చిత్రం...

    నెక్ట్స్ చిత్రం...

    అలాగే విష్ణుతో ఇంకో సినిమా చేస్తున్నాను. కానీ దాని పేరు టెన్షన్‌ కాదు.. అటెన్షన్‌ కాదు. సినిమా పూర్తయ్యాక పేరు చెప్తాను. మరో కథ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాను అని చెప్పారు.

    English summary
    Ram Gopal Varma says that he is not intrested to work with Balakrishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X