ఒక్కొక్కరిగా వాళ్ళ వాళ్ళ రూముల్లో.. ఆ యాప్‌లో ‘క్లైమాక్స్’.. వర్మ ట్వీట్స్ వైరల్
రామ్ గోపాల్ వర్మ శైలే వేరు. అందరూ ఒకటి అంటే ఇతనుమ ాత్రం ఇంకోటి అంటాడు. అందుకే అందరిలోను వర్మ ప్రత్యేకంగా నిలుస్తాడు. గత రెండు మూడు రోజులుగా వర్మ తెగ హల్చల్ చేస్తున్నాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో క్లైమాక్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. క్లైమాక్స్ టీజర్, ఫ్రీక్ అవుట్ అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాడు. అయితే ఈ సినిమాను ఎప్పుడు ఎలా రిలీజ్ చేస్తాడా? అని అందరూ అనుకున్నారు. అయితే ఓ ప్రత్యేకమైన యాప్‌లో నేరుగా క్లైమాక్స్‌ను రిలీజ్ చేస్తానని ప్రకటించాడు.

ప్రస్తుతం అంతా ఓటీటీ వైపే..
థియేటర్ల హవా ఉన్నప్పుడే ఓటీటీ రాజ్యం మొదలైంది. ఎప్పటి నుంచో ఓటీటీలు దేశవిదేశాల్లో ఫేమస్ కాగా.. మన దగ్గర కూడా వీటి హవా మొదలైంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్స్ ఓ రేంజ్ క్రేజ్ దక్కించుకున్నాయి. తెలుగులోనూ ఆహా వంటి యాప్ మొదలైంది.

అన్ని రకాల చిత్రాలు..
ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్స్ చేస్తూ...‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్ shreyaset app లో ఉండేవి అందమైన అమ్మాయిల కధలు (నాకిష్టం కాబట్టి ) పవర్ఫుల్ల్ మగాళ్ల కధలు (నాకిష్టం కాబట్టి ) క్రిమినల్స్ కధలు (నాకిష్టం కాబట్టి ) పోలీసుల కధలు (నాకు ఇంకా ఇష్టం కాబట్టి ) దెయ్యాల కధలు ( నాకు ఇంకా ఇంకా ఇష్టం కాబట్టి ) ఆర్జివి వరల్డ్ థియేటర్ shreyaset app లో చచ్చినా ఉండనివి ఫ్యామిలీ డ్రామాలు (నాకు బోర్ కొడతాయి కాబట్టి ) దేవుళ్ళ సినిమాలు ( నేను నమ్మను కాబట్టి ) సెక్స్ కామెడీలు ( నేను సెక్స్ ని చాల సీరియస్ గ తీసుకుంటాను కాబట్టి )

ఆహ అని ఫ్యామిలీలు ఎవ్వరూ..
మియా మాల్కోవా నటించిన "క్లైమాక్స్ "సినిమా రిలీజ్ అవుతున్న shreyaset యాప్ లో వస్తున్న ఆర్జీవీ వరల్డ్ ఆన్లైన్ థియేటర్ ని ఆహ అని ఫ్యామిలీలు ఎవ్వరూ అనరు ఎందుకంటే ఫ్యామిలీల కోసం ఫ్యామిలీలు పెట్టి ఆహ అనిపించుకోవడం మేము కేర్ చెయ్యము
Recommended Video

కరోనా కూడా ఆపలేదు..
యాప్ లో వస్తున్న క్లైమాక్స్ సినిమాని, దేవుడు కాదు కదా, సాక్షాత్తు కరోనా దిగివచ్చిన ఆపలేదు థియేటర్ల పై ఓటిటి ల ప్రభావం చాలా కాలం నుంచి ఉన్నపటికీ కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రతి ఒక్కలా కళ్ళు తెరిపించింది. యాప్ లో వస్తున్న ఆర్జివి వరల్డ్ థియేటర్ రియల్ ఫ్యామిలీ యాప్.. అంటే దానర్ధం ఫ్యామిలీ లో అందరూ ఒక్కొక్కరిగా వాళ్ళ వాళ్ళ రూముల్లో వాళ్ళ రియల్ ఫీలింగ్స్ తో చూసుకునే లాంటి కంటెంట్ ఉంటుంద'ని క్లైమాక్స్ గురించి వర్మ వరుస ట్వీట్స్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











