twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు ఫ్లాఫులు ఎందుకు వచ్చాయంటే..రామ్ గోపాల్ వర్మ

    By Srikanya
    |

    ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తను అప్పుడప్పుడూ హిట్లు..ఎక్కువగా ఫ్లాఫ్స్ ఎందుకిస్తున్నాను అన్నదానికి చక్కగా వివరణ ఇచ్చారు. ఆయన మాటల్లేనే...నేనెప్పుడూ చెప్తూంటాను..ఎక్కడా గొప్ప దర్శకులు, గొప్ప నటులు అనేవారు అసలు ఉండరు. కేవలం బాగా దర్శకత్వం వహించిన సినిమాలు, బాగా నటించిన పాత్రలు మాత్రమే ఉంటాయని. దర్శకుడు ఎంపిక చేసుకున్న కథా వస్తువుని బట్టే గొప్పగా దర్శకత్వం వహించడానికి అవకాశం ఉంటుంది. అలాగే నటుడు తను నటించిన పాత్రల ఔన్నత్యాన్ని బట్టే గొప్పగా నటించాడని పేరు రావడానికి అవకాశం ఉంటుంది.

    ఉదాహరణకు అప్పట్లో నాగార్జునతో 'శివ' తీసింది నేనే.అలాగే మొన్నామద్య 'శివ 2006' తీసింది కూడా నేనే. రెండింటికి డైరెక్టర్ నేనే అయినప్పుడు ఒకటి చాలా బాగా, ఇంకొకటి చాలా చెత్తగా రావడానికి కారణం ఏమిటి? ఎంచుకున్న కథా వస్తువును బట్టి డైరెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మారిపోతూ ఉంటుది.అయినా ఓ ఫిల్మ్ మేకర్ కు ఉన్న అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే....తీసుకున్న కథావస్తువు తనకి బాగా 'కొట్టినపిండి' అని ఫీలయినప్పుడు ఒక అహకారం రావడం ఖాయం..అదే నాకు అప్పుడుప్పుడూ జరుగుతూంటుంది. ఇక శివ...కాలేజీ క్యాంపస్ లో నేను చూసి, అనుభవించిన గూండాయిజాన్ని తెరకెక్కించాలన్న బలమైన కోరిక వల్ల జన్మించింది. అలాగే క్షణక్షణం....శ్రీదేవిని ఎంత అందంగా చూపొంచొచ్చన్న తపనతో రూపొందింది.అందుకనే ఆ రెండు చిత్రాలు బావుంటాయి.

    అలాగే ఊర్మిళతో తీసిన రంగీలా...హాలీవుడ్ మ్యూజికల్ క్లాసిక్ 'సింగింగ్ ఇన్ ద రైన్' వగైరా సినిమాల చిత్రీకరణ విధానం నుంచి స్ఫూర్తి పొంది. దాన్ని భారతీయతకు అనువదించే ప్రయత్నం లోంచి పుట్టింది. ఇక జేడీతో చేసిన సత్య...నేను ముంబైకి కొత్త కాబట్టి, దాన్ని ఒక బయటివాడిగా అర్ధం చేసుకున్న పరిస్థితులకు ప్రతిబింబం. అక్కడ ఉన్న అస్తవ్యస్థ పరిస్థితులను సినిమా క్రమంలో కూర్చాలన్న తపనతో ఒక కొత్త స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సత్య నుంచి యాదృచ్ఛికంగా వచ్చింది. ఇదిలా ఉంటే..కంపెనీ...సత్య పూర్తయ్యే టైమ్ కి...ముంబాయి మాఫియా మీద నాకొచ్చిన ఒక స్థిరమైన అవగాహన నుంచి వచ్చింది.మరి సర్కార్ అంటారా....గాడ్ ఫాదర్ సినిమాలా కాకుండా, దాని రచయిత ఒకిజనల్ రచయిత మ్యారియోప్యూజో రచనలోని ఆర్ధ్రతని కెమెరాలో బంధించడానికి ప్రయత్నించి తీసిన సినిమా.ఇక ఫ్లాపులు ఎప్పుడొస్తాయి..వచ్చాయి అంటే...ఈ తరహా సినిమాలు నేను కళ్లు మూసుకుని కూడా చేయగలను అనే పొగరు ఎక్కినప్పుడు 'శివ 2006' వంటి ఫ్లాప్ బస్టర్లు వస్తాయి అంటున్నారు వర్మ తన బ్లాగ్ లో.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X