ఆ పొరపాటు రిపీట్ కానివ్వను..రామ్ గోపాల్ వర్మ

By Srikanya

'రక్ష' లో చేసిన పొరపాటు రిపీట్ కాకుండా ఈ సారి ప్రేక్షకులను పూర్తి స్ధాయిలో భయపెడతానంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా 'రక్ష'కు సీక్వెల్‌గా 'ఆవహం' చేస్తున్నారు. ప్రిబ్రవరి మొదటి వారంలో ఈ చిత్రం రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.."నేను తీసిన 'రక్ష' సినిమా అనుకున్నంత భయపెట్టలేదని కొందరి వాదన. దానికి కారణం వుంది. భయం రెండు రకాలు. ఒకటి..పరిస్థితులు ఒక పాత్రను నిస్సహాయ స్థితిలోనే తీసుకెళ్లి భయపెట్టడం. రెండు.. సినిమాకు సంబంధించిన టెక్నికాలటీ ద్వారా ప్రేక్షకుడి చూట్టూ ఏదో జరిగిపోతుందన్న భ్రమలోకి తీసుకెళ్లి భయపెట్టడం. ఇక ఊర్మిళతో నేను చేసిన 'భూత్‌' రెండో రకానికి చెందిన సినిమా అయితే, 'రక్ష'మొదటి రకానికి చెందుతుంది.

ఈ సారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా 'రక్ష'కు సీక్వెల్‌గా 'ఆవహం' చేస్తున్నాం' అన్నారు రామ్‌గోపాల్‌వర్మ. తెలుగు, తమిళ్‌, హిందీల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిలింద్‌ గడాక్కర్‌ దర్శకుడు. ఈ చిత్రం కథ రక్ష చిత్రానికి కొనసాగింపు. రక్షలో తన పాప కోసం రాజీవ్‌లో ఆందోళనతో పోరాడతాడు. తన పాపకు చేతబడి చేసిన మంత్రగాణ్ని చంపిస్తాడు. అతగాడు ప్రేతాత్మ రూపంలో వస్తే రాజీవ్‌ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశం చుట్టూ 'ఆవహం' నడుస్తుంది. ఆయన సమర్పణలో సార్థక్‌ మూవీస్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌, జడ్‌త్రీ పిక్చర్స్‌ సంయుక్త నిర్మాణంలో ప్రశాంత్‌ బుర్రా నిర్మిస్తున్న చిత్రం 'ఆవహం'. ప్రేక్షకుల్ని క్షణక్షణం భయంపెట్టే ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నామని, ఫిబ్రవరి ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X