‘క్లైమాక్స్’తో మొదలైన వర్మ దూకుడు.. వరుస సినిమాలతో హంగామా..

రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషన్ అవుతుందని అందరికీ తెలిసిందే. ఈ మధ్య మరీ ఆ సెన్సేషన్ ఎక్కవైపోతోంది. ఇక థియేటర్స్ ఇప్పట్లో తెరిచేలా లేరని అర్థం చేసుకున్న వర్మ.. ఈ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటున్నాయి. ఇక రోజుకో సినిమా అన్నట్టుగా కథ, కథనాలు, నిడివి వంటి వాటితో సంబంధం లేకుండా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వర్మ చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

క్లైమాక్స్‌తో దాడి..

క్లైమాక్స్‌తో దాడి..

మియా మాల్కోవాతో ఆర్జీవి సృష్టించిన ఓ కళాఖండం క్లైమాక్స్. టీజర్, ట్రైలర్ పుట్టించిన వేడికి చాలా మంది ఎగబడ్డారు. వారి ఆత్రుతను క్యాష్ చేసుకోవడానికి సినిమాను చూడటానికి వంద రూపాయల టిక్కెట్టును పెట్టాడు వర్మ. అయితే తీరా చూశాక విషయం ఏమీ లేదని వంద రూపాయలు, నెట్ బ్యాలెన్స్ వృథా అయ్యాయని నిరుత్సాహ పడ్డారు.

‘నగ్నం'తో వేడి

‘నగ్నం'తో వేడి

అయితే ఈ చిత్రం అయిపోయింది కదా అని అనుకునే లోపే.. తాను రాజమౌళిని కాదని తనది ఆర్ఆర్ఆర్ చిత్రం కాదని చెబుతూ ఎన్ఎన్ఎన్ (నంగా, నేక్‌డ్, నగ్నం) గురించి ప్రచారం చేశాడు. టీజర్ అడల్ట్ చిత్రాలను మించిపోయేలా ఉండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

అందుకే ఎక్కువ రేటు..

అందుకే ఎక్కువ రేటు..

అయితే ఈ నగ్నం సినిమాకు రేటును ముందే ఫిక్స్ చేశాడు. క్లైమాక్స్ సినిమాకు వంద రూపాయలుగా ఫిక్స్ చేసిన వర్మ.. దీనికి మాత్రం రెండొందలని ప్రకటించాడు. దానికి గల కారణాన్ని కూడా వర్మ తనదైన శైలిలోనే చెప్పాడు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. విదేశీ స్త్రీల కంటే భారత స్త్రీలనే నేను రెట్టింపుగా గౌరవిస్తాను అందుకే ఎక్కువ రేటును పెట్టానని తెలిపాడు.

ఇకపై చూడండి..

ఇకపై చూడండి..

అయితే వర్మ ఇకపై ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉంటానని చెప్పకనే చెప్పాడు. క్లైమాక్స్ తన కెరీర్ ప్రారంభమని ఇకపై ఆర్జీవీ వరల్డ్ ఫ్లాట్‌ఫామ్‌పై ఎలాంటి పాత్ బ్రేకింగ్ కంటెంట్‌లు వదులుతానో చూడండని గాడ్సేపే సినిమా తీయబోతోన్నట్టు ప్రకటించాడు. అంతేకాకుండా కిడ్నాపింగ్ కత్రినాకైఫ్ అనే మరో సినిమా కూడా తీయబోతోన్నట్టు తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X