అమ్మాయిలను చూడాలంటే సిగ్గు.. అందుకే ఆమెను నగ్నంగా చూడాలనుకొన్నా.. వర్మ

కరోనావైరస్ సినిమా తీయాలనే ఆలోచన ప్రధాని మోదీ లాక్‌డౌన్ విధించిన రోజు కలిగింది. ఆ తర్వాత మూడు రోజుల్లో స్క్రిప్టు పూర్తయింది. ఇక లాక్ డౌన్ కొనసాగుతుండగానే షూట్ చేశాం. అన్నీ జాగ్రత్తలు తీసుకొన్నాం. లాక్‌డౌన్ ముగిసే లోపే అంటే మరి కొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తాం అని వర్మ తెలిపారు. కరోనావైరస్, క్లైమాక్స్ సినిమా విశేషాలను వెల్లడిస్తూ..

కరోనావైరస్ భయాన్ని మాత్రమే

కరోనావైరస్ భయాన్ని మాత్రమే

కరోనావైరస్ గురించి నేను ఏమీ చెప్పలేదు. కానీ కరోనావైరస్ నేపథ్యంలో కలిగే భయాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకొన్నాను. కరోనాకు, దయ్యానికి తేడాలేదు. కుటుంబంలో ఎంత ఇష్టమైన వ్యక్తికైనా కరోనా వస్తే వారిని చూసి భయపడటమనేది సాధారణం. ఎమోషన్స్ అనేవి మనిషిని మార్చేస్తుంది అని ఆర్జీవి అన్నారు.

 కన్నీరు పెట్టుకొన్నాను

కన్నీరు పెట్టుకొన్నాను

సాధారణంగా నాకు భావోద్వేగాలు ఉండవు. నేను కన్నీరు పెట్టుకోవడం అంటూ జరుగదు. బాధపడటమనే కూడా ఉండదు. మనిషి బతకడమనేది ఓ ఫీలింగ్. ఎదుటి వ్యక్తిని ఆ ఫీలింగ్ ఎమోషన్‌కు గురిచేస్తే ఉండే ఎమోషన్స్ వేరు. కరోనావైరస్ సినిమా స్క్రిప్టు రాస్తున్న సమయంలో నేనే కన్నీళ్లు పెట్టుకొన్నాను. అలాంటి సంఘటన నా కెరీర్‌లో ఎప్పుడు జరుగలేదు అని ఆర్జీవి అన్నారు.

కరోనావైరస్‌తో భావోద్వేగం

కరోనావైరస్‌తో భావోద్వేగం

కరోనావైరస్ అనే అంశాన్ని తీసుకొని ఫ్యామిలీలో ఎమోషన్స్, లవ్‌ను పరీక్షిస్తున్నాం. సాధారణంగా దగ్గు వచ్చిందా?.. కరోనాతో దగ్గువచ్చిందా.. ఒకవేళ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే అక్కడ కరోనా పేషెంట్స్ ఉంటారనే భయం, ఇంట్లో ఉంటే మరో నలుగురికి కరోనా వచ్చే ప్రమాదం ఉంటుంది.. ఇలాంటి కాంప్లికేట్ విషయాలను అన్నీ తీసుకొని కరోనావైరస్ సినిమాను రూపొందించాం అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

ఓటీటీదే హవా

ఓటీటీదే హవా

కరోనావైరస్ కారణంగా సినిమా పరిశ్రమలో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఓటీటీ ప్రధాన పాత్రను పోషిస్తున్నది. ఇప్పుడు అందరూ మొబైల్ ఫోన్‌లో చూస్తున్నప్పుడు.. అలాంటి వాటికి అలవాటు పడుతున్నప్పుడు ఓటీటీకి ప్రాధాన్యం పెరగడం ఖాయం. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు వేగంగా చోటుచేసుకొంటున్నాయి అని ఆర్జీవి అభిప్రాయ పడ్డారు.

Recommended Video

Ram Gopal Varma Planning To Come Up With 'Deyyam' Movie Sequel
 మియాను న్యూడ్‌గా చూడాలనుకొన్నా

మియాను న్యూడ్‌గా చూడాలనుకొన్నా

క్లైమాక్స్ సినిమా గురించి చెబుతూ.. మియా మాల్కోవా లాంటి అమెరికా అమ్మాయిని న్యూడ్‌గా చూడాలనుకొన్నాను. ఎందుకంటే నేను విజయవాడలో చదువుకొన్నప్పుడు నేను అమ్మాయిలను చూడాలంటే సిగ్గు వేసేది. అలాంటి పరిస్థితుల నుంచి నేను వచ్చాను కనుకే మియా మాల్కోవాను అలా చూడాలనుకొన్నాను అని వర్మ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X