ఇండియాకు దాపరించిన కరోనా, శివసేనను పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదు.. ఆర్జీవీ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ తన నిర్ణయాన్ని చెప్పడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయడన్న సంగతి తెలిసిందే. తనకు ఏది అనిపిస్తే అదే చెబుతాడు. సమాజం మొత్తం ఓ వైపు ఉన్నా సరే ఆర్జీవీ మాత్రం తనకు నచ్చిందే చేస్తాడు. ప్రస్తుతం బాలీవుడ్, సుశాంత్ సింగ్ కేసు, రిపబ్లిక్ టీవీ చేస్తోన్న ఆరోపణలు, అర్నాబ్ గోస్వామి విరుచుకుపడుతున్న తీరు, రియా చక్రవర్తిని టార్గెట్ చేసిన విధానంపై ఆర్జీవీ ఎన్నో రకాలు స్పందిస్తూనే ఉన్నాడు.

రియాకు మద్దతు పలికిన మంచు లక్ష్మీ, తాప్సీ, విద్యా బాలన్‌లు ఎంతో పొడిగాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌ స్టార్ హీరోలను ఘోరంగా అవమానించాడు కూడా. తాజాగా కంగనా రనౌత్‌పై వర్మ ఓ రేంజ్‌లో విరుచుకపడ్డాడు.

మొదటి నుంచి అంతే..

మొదటి నుంచి అంతే..

సుశాంత్ సింగ్ కేసులో నెపోటిజం, బాలీవుడ్ మాఫియా అంటూ కామెంట్స్ వస్తోన్న తరుణంలోనూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. నెపోటిజం ప్రతీ చోటా ఉంటుందని, అయినా ప్రజలు ఒప్పుకుంటేనే స్టార్స్ అవుతారని, కేవలం బంధుప్రీతి వల్లే హీరోలు అవ్వలేరని అన్నాడు.

అర్నబ్‌పై సినిమా..

అర్నబ్‌పై సినిమా..

సుశాంత్ కేసు విషయంలో బాలీవుడ్ బూతంగా చూపెట్టడం, కేసును ఏకపక్షంగా విచారిస్తున్నాడంటూ ఆర్జీవీ సెటైర్స్ వేశాడు. అంతటితో ఆగకుండా మీడియా ప్రాస్టిట్యూట్ అంటూ అర్నబ్‌పై ఓ సినిమాను తీయబోతోన్నట్టు ప్రకటించాడు. మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసేశాడు.

బాలీవుడ్ మౌనంపై..

బాలీవుడ్ మౌనంపై..

బాలీవుడ్‌ను దోషిగా చేస్తూ వస్తోన్న ఆరోపణలపై స్టార్స్ మౌనంగా ఉండటంపైనా సెటైర్ వేశాడు. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సెలైంట్‌గా ఉండటంపై కామెంట్ చేస్తూ శివసేన, బాల్‌థాకరేపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. శివసేన ఇలా తయారవ్వడంపై ఆయన ఆత్మ బాధపడుతుందని కామెంట్స్ చేశాడు.

తాజాఘటనపైనా..

తాజాఘటనపైనా..

మహరాష్ట్ర, ముంబై ఏమైనా పాక్ ఆక్రమిత కాశ్మీరా అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని లేపాయో అందరికీ తెలిసిందే. సంజయ్ రౌత్, శివసేన బెదిరింపుల అనంతరం నేడు కంగనా ముంబైలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ముంబై మున్సిపల్ అధికారులు కంగనా నివాసాన్ని కూల్చేశారు. అక్రమ నిర్మాణం అంటూ కంగనా కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ ఘటనపై కంగనా న్యాయపోరాటానికి సిద్దమైంది. ఇక ఈ ఘటనపై ఆర్జీవీ స్పందించాడు.

Recommended Video

Amaram Akhilam Prema Would Be Released On September 18 In Aha
కంగనాపై కౌంటర్లు..

కంగనాపై కౌంటర్లు..

కంగనా మహారాష్ట్ర సీఎం అవుతుంది, అర్నబ్ పీఎం అవుతాడు.. ఇక కాంగ్రెస్ ఇటలీకి వెళ్లిపోతుంది.. శివసేన అంతర్దానం అవుతుందంటూ సెటైర్లు వేశాడు. మరో ట్వీట్ చేస్తూ.. ఇండియాకు దాపరించిన కరోనాకు, శివసేనకు పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదంటూ సెటైర్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X