జీవితంలో చాలా పాపాలు చేశాను.. జీఎస్టీ తీసి తప్పుచేశా.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో కడుక్కొంటాను!
Recommended Video

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంంగా తెరకెక్కుతున్న లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం ప్రమోషన్ భారీగా మొదలైంది. సింహగర్జన పేరుతో శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోసాని కృష్ణమురళి, పృథ్వీ, లక్ష్మీపార్వతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే..

నేను బెదిరిస్తాను
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రిలీజ్ చేయకుండా అడ్డుకొంటామని కొందరు హెచ్చరిస్తున్నారనే విషయం నిజమే. ప్రధానంగా టెలివిజన్ రౌడీలు నరికేస్తామని బెదిరిస్తున్నారు. బెదిరించే వ్యక్తులను నేను పట్టించుకోను. వారు బెదిరిస్తే నేను వాళ్లను బెదిరిస్తాను అని వర్మ అన్నారు.

బెదిరించే వాళ్లు ఏమీ చేయరని
నన్ను బెదిరించే వాడు ఏమీ చేయరు. సాధారణంగా హాని తలపెట్టే వ్యక్తి ఎప్పుడూ బెదిరించడు. బెదిరించే వాడు హాని తలపెట్టడు అని నమ్ముతాను. రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో బెదిరింపులు ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు.

పాపాలు చేశాను.. కడిగేసుకొంటానను
నా లైఫ్‌లో నేను చాలా పాపాలు చేశాను. జీఎస్టీ సినిమా తీసిన పాపాన్ని కడిగివేసుకొంటాను. లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో తిరుపతికి వెళ్లి పాపాలు కడిగేసుకొంటున్నా. నిజాలు చెప్పి సత్య హరిచంద్రుడిగా మారుతాను. ఈ సినిమాను రాజకీయ ప్రయోజనాల కోసం చేయలేదు. రాజకీయాలతో సంబంధం లేదు అని రాంగోపాల్ వర్మ తెలిపారు

డైరెక్టర్‌గా ఆగస్త్య పేరును అందుకే వేశాను
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అగస్త్య మంజు కాంట్రిబ్యూషన్ ఎక్కువ. ఈ సినిమాకు చాలా రీసెర్చ్ చేశాడు. అందుకే దర్శకుడి టైటిల్‌లో నా పేరుతోపాటు ఆగస్త్య పేరు కూడా వేశాం. ఆయన పేరును దర్శకుడి టైటిల్ వేయడం సబబే. ఆయన చేసిన పనికి ఫలితాన్ని ఇవ్వాలనుకొన్నాను. ఈ కారణాల వల్లనే నా పేరు పక్కన ఆయన పేరును వేశాం.

ఎన్టీఆర్ గొప్పతనాన్ని తగ్గించలేదు
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్ ఔనత్యాన్ని తగ్గించలేదు. ఆయనకు ఉన్న గొప్పతనాన్ని గొప్పగా చూపించాను. 70 ఏళ్ల వరకు మహారాజులా బతికాడు. ఆయన జీవితంలో వైశ్రాయ్ ఎపిసోడ్ తర్వాత చాలా మానసిక క్షోభకు గురయ్యాడు. కొంతమంది కలిసి ఆయనను దారుణమైన స్థితికి ఎలా తీసుకొచ్చారనేది లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చూస్తారు.


Click it and Unblock the Notifications











