ఏది చేసినా టీవీ కెమెరాల ముందే చేస్తా.. సీసీటీవీల్లో దొరికిపోయే పనులు చేయను.. వర్మ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన నేకెడ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్యూల్లో చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోతున్నాయి. ఇటీవల ఆడా, మగా అనే తేడా లేకుండా యాంకర్లపై ప్రశంసలు గుప్పించడం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే మీరు మీటూ ఆరోపణలు ఎలా తప్పించుకొంటారనే ప్రశ్నకు వర్మ ఇచ్చిన సమాధానం విస్తృతంంగా ప్రచారం అవుతున్నది. ఆ ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్య పాయింట్లు మీ కోసం..

సత్య హరిశ్చందుడి భక్తుడను
దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. నా మనసులో ఏది అనిపిస్తే అది చేస్తాను. ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తాను. వాస్తవానికి నేను సత్య హరిచంద్రుడి భక్తుడిని. నా మనసులో ఒకటి.. బయటకు ఒకటి చెప్పను. ఎవరైనా ఏదైనా అడిగితే దానికి సమాధానం దాచుకొకుండా చెబుతాను. ఒకవేళ నేను అబద్దం చెబితే సత్య హరిచంద్రుడు బాధపడుతాడు అని వర్మ అన్నారు.

యాంకర్‌పై అనుచితంగా వ్యాఖ్యలు
మీకు ఎవరిని చూస్తే వావ్ అనిపిస్తుంది అని ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు వర్మ సమాధానం ఇస్తూ మిమ్మల్నే. మిమ్మల్ని బికినీలో చూడాలని ఉంది అని చెప్పాను. అందులో నాకే తప్పనిపించలేదు. ఆమె అడిగిన ప్రశ్నకు నేను నా మనసులో ఉన్న సమాధానం చెప్పాను. కాకపోతే దానిని తప్పుడు రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దానికి రొమాంటిక్ రంగు పులిమారు అని వర్మ అన్నారు.

సోషల్ మీడియాలో తప్పుడుగా చూపిస్తున్నారు
కొన్నిసార్లు సోషల్ మీడియాలో కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి సంఘటనకు ఉదాహరణే నేను చెప్పిన జవాబుకు కొంత కలరింగ్ ఇచ్చి దానిని మరో రకంగా ప్రచారం చేశారు. నా పవిత్రమైన ఆలోచనను వారు తప్పుగా ప్రచారం చేశారు. దానికి చాలా బాధగా ఫీలయ్యాను. అందుకే నాకు నచ్చలేదని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాను అని వర్మ అన్నారు.

నేను ఏది చేసినా బహిరంగంగానే చేస్తా
ఇక సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందిపై మీటూ ఆరోపణలు వచ్చాయి. నాపై ఎందుకు రావంటే.. నేను ఏం చేసినా టెలివిజన్ కెమెరాల ముందే చేస్తాను. సీసీటీవీ కెమెరాల్లో చిక్కేలా.. బయటపడేలా ఏ పనులు చేయను. అందుకే నన్ను ఎవరూ పట్టుకోలేరు. ఏ పనిచేసినా అందరి ముందే చేస్తే నాపై ఆరోపణలు చేయడానికి, నన్ను పట్టుకోవడానికి ఏమీ ఉండదు అని రాంగోపాల్ వర్మ అన్నారు.

ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో
లాక్‌డౌన్ కాలంలో రాంగోపాల్ వర్మ వరుసగా చిత్రాలను రిలీజ్ చేస్తూ ఓటీటీలో సరికొత్తగా సంచలనం రేపుతున్నారు. ఆర్జీవి వర్డల్ థియేటర్ చిత్రంలో రిలీజ్ చేసిన క్లైమాక్స్, నేకెడ్ చిత్రాలకు అంతగా ఆదరణ దక్కలేదు. త్వరలోనే మరికొన్ని చిత్రాలను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నానని ఇటీవల పలు ఇంటర్వ్యూలో తెలిపారు. కరోనావైరస్, పవర్ స్టార్ సినిమాలను రిలీజ్ చేయనున్నట్టు రాంగోపాల్ వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











