అందుకే భారత స్త్రీకి రేటు ఎక్కువ.. వర్మ సంచలన కామెంట్స్
రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషనే. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వర్మ సంచలనాలు సృష్టిస్తున్నాడు. క్లైమాక్స్ అంటూ మియా మాల్కోవాతో రచ్చ చేసిన వర్మ.. లాక్‌డౌన్‌లో కరోనా వైరస్ సినిమాను తెరకక్కించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అక్కడి వరకు అంతా బాగుందని అనుకుంటే తాజాగా మరో చిత్రాన్ని రెడీ చేశాడు. నగ్నం అంటూ సెగలు పుట్టిస్తున్నాడు.

క్లైమాక్స్‌తో లాభాలు..
క్లైమాక్స్ సినిమాను చూడటానికి వంద రూపాయల టిక్కెట్టును పెట్టాడు వర్మ. ఇక టీజర్, ట్రైలర్ పుట్టించిన వేడికి చాలా మంది ఎగబడ్డారు. అయితే తీరా చూశాక వంద రూపాయలు వృథా అయ్యాయని నిరుత్సాహ పడ్డారు. వారి సంగతేమో గానీ వర్మకు మాత్రం లాభాలే వచ్చినట్టు తెలుస్తోంది.

రాజమౌళిని కాదు..
తాను రాజమౌళిని కాదని తనది ఆర్ఆర్ఆర్ చిత్రం కాదని చెబుతూ ఎన్ఎన్ఎన్ (నంగా, నేక్‌డ్, నగ్నం) గురించి ప్రచారం చేశాడు. టీజర్ వస్తుందని అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాడు. అడల్ట్ చిత్రాలను మించిపోయేలా ఉన్న ఆ టీజర్‌ను చూసి అంతా పిచ్చెక్కిపోయారు.

రేటు రెండొందలు
అయితే ఈ నగ్నం సినిమాకు రేటును ముందే ఫిక్స్ చేశాడు. క్లైమాక్స్ సినిమాకు వంద రూపాయలుగా ఫిక్స్ చేసిన వర్మ.. దీనికి మాత్రం రెండొందలని ప్రకటించాడు. దానికి గల కారణాన్ని కూడా వర్మ తనదైన శైలిలోనే చెప్పాడు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

అందుకే రేటు ఎక్కువ..
నగ్నం సినిమా రేటును ఉద్దేశిస్తూ వర్మ.. ‘నేక్‌డ్ (ఎన్ఎన్ఎన్) చిత్రానికి, క్లైమాక్స్‌కు నిర్దారించిన వందకంటే ఎక్కువగా మరో రూ. 100 పెంచి రెండొందలుగా ఎందుకు ఫిక్స్ చేశానంటే.. విదేశీ స్త్రీల కంటే భారత స్త్రీలనే నేను రెట్టింపుగా గౌరవిస్తాను' అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











